చైనా మొబైల్‌ మేకర్‌ వన్‌ప్లస్ తన నూతన స్మార్ట్‌ఫోన్ వన్‌ప్లస్ 6టీ ని భారత మార్కెట్లో కూడా లాంచ్‌ చేసింది.  వన్‌ప్లస్ 6టి స్మార్ట్‌ఫోన్‌ 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ భారత్‌లో రూ.37,999 గా నిర్ణయించింది. అలాగే 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.41,999 ఉండగా, 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.45,999 గా ఉంది.  వన్‌ప్లస్ 6టీ ఆన్‌లైన్‌లో అయితే అమెజాన్‌లో లభిస్తుంది. ఐసీఐసీఐ క్రెడిట్, డెబిట్, సిటీబ్యాంక్ క్రెడిట్ కార్డులపై రూ.2,000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది.


వన్‌ప్లస్ 6టీ స్మార్ట్‌ఫోన్ ఆఫ్‌లైన్‌లో కొనాలనుకుంటే రిలయెన్స్ డిజిటల్ స్టోర్లల్లో లభిస్తాయి. భారతదేశంలోని ఏ రిలయెన్స్ డిజిటల్ స్టోర్‌లో అయినా వన్‌ప్లస్ 6టీ ఆన్‌లైన్ ధరకే కొనుక్కోవచ్చు. రిలయెన్స్ డిజిటల్ స్టోర్లల్లో ఉండే ఆఫర్లను కూడా పొందొచ్చు. జియో నుంచి రూ.299 మొదటి ప్రీపెయిడ్ రీఛార్జ్‌పై రూ.5,400 క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. రూ.150 విలువైన 36 ఓచర్లు లభిస్తాయి. 

రూ.16 వేల ఫోన్ రూ.999 చెల్లించి సొంతం చేసుకోండి!

ఈ ఫోన్‌ను కొనుగోలు చేసిన కస్టమర్లకు రూ.5400 విలువగల ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్‌ను 36 వోచర్ల రూపంలో జియో అందివ్వనుంది. ఈ ఫోన్‌ను కొనుగోలు చేసిన వారు కోటక్ 811 అకౌంట్ తీసుకుంటే రూ.2వేల విలువైన యాక్సిడెంట్ అండ్ లిక్విడ్ డ్యామేజ్  ప్రొటెక్షన్ ఇన్సూరెన్స్‌ను ఉచితంగా పొందవచ్చు.

వన్‌ప్లస్ 6టీ ఫీచర్లు :

6.41 ఇంచుల డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్ఆండ్రాయిడ్ 9.0 పై 6/8 జీబీ ర్యామ్, 128/256 జీబీ స్టోరేజ్ 16+20 ఎంపీడ్యుయల్  రియర్‌ కెమెరా, 16 ఎంపీ  సెల్ఫీ కెమెరా3700 ఎంఏహెచ్ బ్యాటరీ


మరింత సమాచారం తెలుసుకోండి: