ఇండియన్ టెలికం రంగంలో జియో ఎంట్రీ సరికొత్త పుంతలు తొక్కింది..వినియోగదారుడు నేట్టింట్లో కి వెళ్ళాలంటేనే భారీగా డబ్బులు ఖర్చు చేసుకోవలసిన పరిస్థితి ఏర్పడిన సమయంలో  జియో ఎంట్రీతో  అందరికి జియో ద్వారా ఫ్రీ నెట్ పరిచయం చేయటమే కాకుండా ఇప్పుడు అతి తక్కువ ధరలో నెట్ వర్క్ అందిస్తున్నాడు. పండగ వస్తే ఇక జియో ఆఫర్లే ఆఫర్లు..అలాంటి సమయంలో జియో కి దీటుగా ప్రభుత్వరంగ సంస్థ  అయిన BSNL సరికొత్త ప్లాన్స్ ని తీసుకువస్తూ జియో కి బిగ్ షాక్ ఇస్తోంది.. తాజాగా...

 Image result for jio vs bsnl annual plans

 జియోకు పోటీగా రెండు సరికొత్త యాన్యువల్ ప్లాన్‌లను బీఎస్ఎన్ఎల్ లాంచ్ చేసింది. ఈ ప్లాన్‌లకు సంబంధించిన వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..365 రోజుల వ్యాలిడిటీతో జియో అందుబాటులోకి తీసుకువచ్చిన ప్రీపెయిడ్ ప్లాన్ రూ.1699 ధర  ట్యాగ్‌తో లభ్యమవుతోంది. 365 రోజుల  వ్యాలిడిటీతో లభించే ఈ ప్లాన్‌లో భాగంగా అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్‌తో పాటు రోజుకు 1.5జీబి 4జీ డేటా అందుబాటులో ఉంటుంది. ఇదే సమయంలో రోజుకు 100 ఎస్ఎంఎస్‌లను పంపుకోవచ్చు

 

అయితే జియో కి పోటీగా ఇప్పుడు BSNL సరికొత్త యాన్యువల్ ప్లాన్‌లను బీఎస్ఎన్ఎల్ లాంచ్ చేసింది. వీటిలో మొదటి ప్లాన్ ఖరీదు రూ.1699. రెండవ ప్లాన్ ఖరీదు రూ.2099. 365 రోజుల వ్యాలిడిటీతో ఈ రెండు ప్లాన్స్ అందుబాటులో ఉంటాయి. వీటిలో మొదటి ప్లాన్‌ను ఆప్ట్ చేసుకున్నట్లయితే రోజుకు 2జీబి 3జీ డేటాతో పాటు అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ అందుబాటులో ఉంటాయి.

 Image result for jio vs bsnl annual plans

రెండవ ప్లాన్‌ను ఆప్ట్ చేసుకున్నట్లయితే రోజుకు 4జీబి 3జీ డేటాతో పాటు అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ అందుబాటులో ఉంటాయి. ఇదే సమయంలో రోజుకు 100 ఎస్ఎంఎస్‌లను పంపుకోవచ్చు. ఈ రెండు ప్లాన్‌లను కంపేర్ చేసి చూసినట్లయితే బీఎస్ఎన్ఎల్ ఆఫర్ చేస్తోన్ ప్లాన్‌లలో డేటా ఎక్కువుగా లభిస్తున్నప్పటికి ఇంటర్నెట్ వేగం మాత్రం 3జీలోనే ఉంటుంది. ఇదే సమయంలో జియో అఫర్ చేసే డేటా 4జీ వేగంతో అందుబాటులో ఉంటుంది.

 


మరింత సమాచారం తెలుసుకోండి: