అందరి దారి ఒకవైపుకి ఉంటే..విభిన్నంగా ఆలోచన చేసేవాళ్ళ దారి రకరకాలుగా ఉంటుంది.అందుకీ గొప్ప గొప్ప సృజనాత్మకలు అన్నీ ఎంతో విభిన్నంగా ఉంటాయి..అయితే మొదట్లో సెల్ ఫోన్స్ వచ్చిన కొత్తలో కొంచం పెద్దవిగా ఉండేవి ఆ తరువాత అరచేతికంటే తక్కువ పరిమాణంలో ఫోన్ వచ్చాయి..పోను పోనూ స్మార్ట్ ఫోన్ లు , నోట్ పుస్తకం సైజులు ఫోన్ లు రావడం మొదలు పెట్టాయి..

 Image result for flexi pai mobile phone

ఇలా రకరకాల సైకులలో పరిమాణాలలో ఫోన్ లు రావడంతో  అనేక సంస్థలు వినియోగ దారులని ఆకట్టుకోవడానికి ఎన్నో రకాలా మొబైల్ ఫోన్ లు తయారు చేయడం మొదలు పెట్టారు అయితే..ఎవరు ఎన్ని మొబైల్ ఫోన్ ఉత్పత్తులు చేసినా సరే అన్నీ ఒకేరకంగా ఉంటాయి కానీ వాటిలో ఫీచర్స్ మాత్రం మార్పులు చెందుతుంటాయి. అయితే తాజగా చైనాకి చెందిన ఒక కంపెనీ విభిన్నంగా ఆలోచించింది.

 Related image

అందరికంటే విభిన్నంగా మొబైల్ తాయారు చేయాలని అనుకుని ఏకంగా ఫోన్ ని మడత పెట్టుకునే విధంగా సరికొత్త మడత ఫోన్ ( ఫోల్దింగ్ ఫోన్ ) తయారు చేసింది..చైనాకు చెందిన రాయ్‌లీ కార్పొరేషన్‌ అనే  సంస్థ 'ఫ్లెక్సీ పై' పేరుతో ఫోల్డబుల్‌ స్మార్ట్‌ఫోన్‌ను తయారు చేసింది. ఇప్పటికే తాము తయారు చేసిన ఫోన్‌ను రెండు లక్షల సార్లు మడత బెట్టి పరీక్షించామని, కాబట్టి ఫోన్‌ తెరపై దృశ్యం ఏళ్ల పాటు ఏ అవాంతరం లేకుండా కనిపిస్తుందని సంస్థ వెల్లడించింది. ఈ ఫోన్‌ను 6జీబీ+128జీబీ, 8జీబీ+256జీబీ, 8జీబీ+జీబీ వేరియంట్లలో విడుదల చేశారు.త దీని ధర ఫోన్‌ వేరియంట్‌ను బట్టి రూ.90 వేల నుంచి రూ.1.2 లక్షల మధ్య ఉండనున్నట్లు తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: