ఐడియా తన ప్రీపెయిడ్ కస్టమర్ల కోసం కొత్త ఆఫర్‌ను ప్రకటించింది..ఈ ఆఫర్ లో 28జీబీ డేటా, అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్, రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లను వినియోగదారులకు అందించనున్నట్లు వెల్లడించింది.ఈ భారీ ఆఫర్ కేవలం రూ.159 దక్కనున్నట్టుగా  తెలుస్తోంది. ఇదిలాఉంటే కొద్దిరోజుల క్రితమే వొడాఫోన్ ఇండియా రూ.159 ప్రీపెయిడ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రెండు బ్రాండ్‌ల వినియోగదారులకు ఒకే రకమైన టారిఫ్‌లను అందించేందుకు ఉమ్మడి సంస్థ సన్నాహాలు చేస్తోంది.

 Image result for idea

అయితే  రూ.159 ప్లాన్ 28 రోజుల పాటు వర్తించనుంది. ఎఫ్‌యూపీ కింద రోజుకు 250 నిమిషాలు, వారానికి 1000 నిమిషాలు మాత్రమే వాయిస్ కాలింగ్ చేసుకోవచ్చు. రిలయన్స్ జియోలోను దాదాపు ఇవే బెనిఫిట్స్ లభిస్తున్నాయి. ఐడియా సెల్యూలార్‌లో 4జీ నెట్‌వర్క్ కనెక్టివిటీ ఉన్నప్పటికీ లోకేషన్ ఆధారంగా ఆటోమేటిక్‌గా కొన్నిసార్లు 4జీ నెట్‌వర్క్ నుంచి 3జీ లేదా 2జీకి మారుతూ ఉంటోంది..జియో మాత్రం అలా కాకుండా కేవలం 4జీ నెట్వర్క్ కే కనెక్ట్ అవుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: