సెల్ ఫోన్ రంగంలో ఎన్నో అద్భుతాలు సృష్టించి అందరి మనసు దోచిన నోకియా ఇప్పుడు మరో సరికొత్త ఫోన్ తో అందరికి అందుబాటు రేటుకే లభిస్తుంది. హెచ్ఏండీ గ్లోబల్ సంస్థ తాజాగా నూతన ఫీచర్ ఫోన్ ని మార్కెట్లో విడుదల చేసింది గతంలో విడుదల చేసిన నోకియా 106 (2013)కి కొనసాగింపుగా నోకియా 106 (2018) పేరిట తాజాగా సంస్థ విడుదల చేసింది.
Nokia 106
ప్రస్తుతం రష్యా మార్కెట్లో అందుబాటులో ఉన్న ఈ ఫీచర్ ఫోన్ త్వరలోనే భారత మార్కెట్లోకి రానుంది.  మన దేశంలో సుమారుగా రూ.1,700కి వినియోగదారులకి అందుబాటులో ఉండనుంది.

అలాగే, దీనిలో 1.8" టీఎఫ్‌టీ డిస్ప్లే , 160 x 120 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, మీడియాటెక్ 6261డీ ప్రాసెసర్, 4ఎంబీ ఇంటర్నల్ స్టోరేజ్, 4 ఎంబీ ర్యామ్, ఎఫ్‌ఎం రేడియో, మైక్రో యూఎస్‌బీ కనెక్టర్, 800 ఎంఏహెచ్ బ్యాటరీ లాంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. ఈ ఫోన్లు ముదురు బుడిద రంగు లో లభ్యమవుతున్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: