చైనా స్మార్ట్‌ఫోన్‌మేకర్‌ హువావే సబ్‌ బ్రాండ్‌  హానర్‌  భారీ కెమెరాతో  ప్రపంచంలోనే తొలి స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేయనుంది.   'ఆనర్ 10 లైట్' పేరిట విడుదల కానున్న ఈ ఫోన్ గ్రేడియాన్ బ్లూ, వ్యాలే వైట్, మ్యాజిక్ నైట్ బ్లాక్ అనే మూడు రంగులలో లభ్యం కానుంది.  గత నెలలో ఈ స్మార్ట్‌ఫోన్‌ను చైనా మార్కెట్లో  ఆవిష్కరించింది.

గత సంవత్సరం చైనాలో 4 జీబీ/6 జీబీ అనే రెండు వేరియంట్లలో విడుదలైన ఈ ఫోన్ ధరలు మనదేశంలో వరుసగా  రూ.14,400 (4 జీబీ), రూ.17,500 (6 జీబీ)గా ఉండే అవకాశం ఉంది. పలు ఆకట్టుకునే ఫీచర్లు ఉన్న ఈ ఫోన్లో అధునాతన కిరిన్ 710 ప్రాసెసర్ ని అమర్చారు. కాగా, ఫ్లిప్ కార్ట్ సంస్థ ప్రత్యేకంగా ఈ ఫోన్ ని విక్రయించనుంది.

ఆనర్ 10 లైట్ ఫీచర్లు : 

6.21" హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే (1080 x 2340 పిక్సల్స్)
కిరిన్ 710 ప్రాసెసర్
4 జీబీ/ 6 జీబీ  ర్యామ్, 64/128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ఆం
డ్రాయిడ్ 9.0పై ఆపరేటింగ్ సిస్టం
13/2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు
24 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
ఫింగర్ ప్రింట్ సెన్సార్
3400 ఎంఏహెచ్ బ్యాటరీ

మరింత సమాచారం తెలుసుకోండి: