మొబైల్ తయారీదారు వివో తాజాగా చైనాలో 'వివో వై89' పేరిట నూతన స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేసింది. అరోరా పర్పుల్, బ్లాక్ గోల్డ్ రంగులలో లభించే ఈ ఫోన్లో భారీ టచ్ స్క్రీన్ (6.26"), స్నాప్ డ్రాగన్ 626 ప్రాసెసర్ లాంటి పలు ఆకట్టునే ఫీచర్లు ఉన్నాయి. దీనికి ఫేస్ అన్‌లాక్ స‌దుపాయాన్ని అందిస్తున్నారు. అలాగే డెడికేటెడ్ డ్యుయ‌ల్ సిమ్‌, మైక్రోఎస్‌డీ కార్డు స్లాట్ల‌ను ఇందులో ఏర్పాటు చేశారు.


వెనుక భాగంలో ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్ ఉంది.  వినియోగ‌దారుల‌కు వ‌చ్చే వారం నుంచి ల‌భ్యం కానుంది. మన దేశంలో ఇది సుమారు రూ.16,700 ధరకి లభించే అవకాశాలున్నాయి. 4 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ గల ఈ ఫోన్ ఆండ్రాయిడ్ ఓరియో 8.1 ఆపరేటింగ్ సిస్టంపై పని చేస్తుంది. 

ఈ ఫోన్ ప్రత్యేకతలు:

  • 6.26" ఫుల్ హెచ్డీ ప్ల‌స్ డిస్ప్లే
  • 4 జీబీ ర్యామ్‌, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌
  • ఆండ్రాయిడ్ ఓరియో 8.1 ఆపరేటింగ్ సిస్టం
  • 16/2 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు
  • 16 మెగాపిక్స‌ల్ ఫ్రంట్ కెమెరా
  • ఆక్టాకోర్ 626 ప్రాసెసర్
  • 3260 ఎంఏహెచ్ బ్యాట‌రీ

మరింత సమాచారం తెలుసుకోండి: