అత్యంత ఖరీదైన ఫోన్ అనగానే చటుక్కున గుర్తొచ్చేది ఐ –ఫోన్ ఈ విషయం అందరికి తెలుసు అయితే ఇప్పుడు ఐ –ఫోన్ రేటు కంటే గూబ గుయ్యిమనేలా. మొబైల్ అభిమానులకి ఆశ్చర్యం కలిగించేలా మిజు బ్రాండ్ మొబైల్ ఓ ప్రత్యేకమైన ఫోన్ ని అభివృద్ధి చేసింది. ఇది ప్రపంచపు మొట్టమొదటి హలోలెస్ ఫోన్ దీని పేరు “మిజు జీరో”..ఇప్పుడు ప్రీ-ఆర్డర్ పై మార్కెట్ లో దొరుకుంతుంది. దీని ఖరీదు అక్షరాలా

 Image result for meizu zero

1,299 డాలర్లు అంటే ఇండియన్ కరెన్సీ లో రూ.92,000 లు  ప్రముఖ క్రౌడ్‌ఫండింగ్ ఫ్లాట్‌ఫామ్ ఇండిగోగో ద్వారా ఈ డివైస్‌ను ఆర్డర్ చేసుకోవచ్చు.ఈ ఫోన్ లో పత్యేకతలు ఏమిటంటే పోర్ట్స్, బటన్స్ అనేవి కనిపించవు. ఇదే సమయంలో ఈ ఫోన్‌లో ఎటువంటి హోల్స్ కూడా ఉండవు. అత్యాధునికమైన టెక్నాలజీ తో రూపొందిన ఈ ఫోన్ ఇప్పుడు ఇప్పుడు ప్రపంచాన్ని ఆకట్టుకుంటోంది.

 Related image

మార్చి 1వ తేదీతో ఈ ఫోన్ కొనుగోలు ఆగిపోనుంది. కేవలం 100 యూనిట్లు మాత్రమే అందుబాటులో తీసుకువచ్చింది ఈ కంపెనీ అయితే ఇప్పటికే ఈ ఫోన్ లలో 16 యూనిట్లు బుక్ అయిపోయినట్లుగా తెలుస్తోంది.సామ్‌సంగ్ గెలాక్సీ స్9 తరహాలో మిజు జీరో కూడా కర్వుడ్ సైడ్స్, సిరామిక్ బాడీ, ఐపీ68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్‌తో స్లిమ్ టాప్ ఇంకా బోటమ్ బిజెల్స్‌ను కలిగి ఉంటుంది.

 Image result for meizu zero

ఈ ఫోన్‌లో 5.99 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ ప్లస్ అమోల్డ్ డిస్‌ప్లేను హౌస్ చేసారు. ఈ డిస్‌ప్లేలో ఇన్‌బిల్ట్‌గా ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఎక్విప్ అయ్యి ఉంటుంది. ఈ స్ర్కీన్ ఎమ్‌సౌండ్ 2.0 అనే టెక్నాలజీని ఉపయోగించుకుని హై-క్వాలిటీ సౌండ్‌ను రిలీజ్ చేస్తుంది. వైర్‌లెస్ ఛార్జింగ్ ద్వారా అ ఫోన్‌ను ఛార్జ్ చేసుకోవల్సి ఉంటుంది. సిమ్ కార్డ్ స్లాట్ స్థానంలో ఈ-సిమ్ స్లాట్‌ను ఉపయోగించుకోవల్సి ఉంటుంది.మొత్తానికి ఈ ఫోన్ మాత్రం టెక్ ప్రపంచం లో హాట్ టాపిక్ అయ్యిందనే చెప్పాలి.

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: