చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ ఫోన్ కంపెనీ ఒప్పో నుంచి మరో అద్భుతమైన స్మార్ట్ ఫోన్ వచ్చింది. ఎఫ్ సిరీస్ లో ఎఫ్ 11 ప్రో పేరుతో ఈ కొత్త ఫోన్ ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. సాధారణంగా ఒప్పో ఎఫ్ సిరీస్ ఫోన్లన్నీ సెల్ఫీ కెమెరాకే ప్రాధాన్యత ఉంటుంది.


అయితే, తాజాగా తీసుకొచ్చిన ఎఫ్ 11 ప్రో లో మాత్రం రియర్ కెమెరా పై దృష్టి సారించారు.   థండర్‌బ్లాక్‌, అరోరా గ్రీన్‌ రెండు కలర్స్‌లో ఇది లభ్యం కానుంది. ఇక సెల్ఫీ కెమెరా విషయానికి వచ్చేసరికి 16 మెగాపిక్సెల్ సామర్థ్యం కలిగిన పాపప్ కెమెరా పొందుపరిచారు.


ఎఫ్‌ 11 ప్రొ ఫీచర్లు :
6.5ఇంచెస్‌  డిస్‌ప్లేస్‌
మీడియాటెక్ హీలియో పీ70 ప్రాసెసర్, 
ఆండ్రాయిడ్ 9.0 పై 
6 జీబీ ర్యామ్, 128 స్టోరేజ్‌
48 +5 ఎంపీ రియర్‌ 
16ఎంపీ పాప్‌ అప్‌  సెల్ఫీ కెమెరా
4000  ఎంఏహెచ్‌

ధరలు :

హై ఎండ్‌ వెర్షన్‌ ధర : రూ. 24,990 

బేసిక్‌ మోడల్‌ ధర : రూ.19,990


మరింత సమాచారం తెలుసుకోండి: