అన్ని కాలాల కంటే కూడా ఎండాకాలంలో మనం ఎక్కువగా మంచి నీళ్ళు త్రాగుతాం. కొంతమంది పని వత్తిడి వలన ఎలాంటి కాలం అయినా సరే మంచి నీళ్ళు తాగకుండా అశ్రద్ద చేస్తూ అనారోగ్యాల పాలవుతూ ఉంటారు. అయితే టెక్నాలజీ విపరీతంగా పెరిగిన సమయంలో ఈ సమస్యకి సైతం పరిష్కార మార్గం కనిపెట్టారు. అసలు మనం రోజుకి ఎన్ని లీటర్ల నీళ్ళు త్రాగుతున్నాము, వాతావరణ పరిస్థితులని బట్టి రోజుకి మనం ఎన్ని ఎన్ని లీటర్ల నీళ్లు తాగాలి  అనే వివరాలని స్మార్ట్ వాటర్ బాటిల్ చెప్పేస్తుంది.

 Image result for thermos smart water bottle

 లేటెస్ట్ టెక్నాలజీ కి తగ్గట్టుగా ఈ వాటర్ బాటిల్ తయారయ్యింది. మన ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు గుర్తిస్తూ  ఎప్పటికప్పుడు హెచ్చరికలు కూడా చేస్తూ ఉంటాయి. ఈ స్మార్ట్ వాటర్ బాటిల్ ఐఒఎస్ , ఆండ్రాయిడ్ ఫ్లాట్ ఫాంల మీద పనిచేస్తుంది.  ఈ స్మార్ట్ బాటిల్ మీరు తాగే సమయాన్ని ఎప్పటికప్పుడు మనకి తెలియచేస్తుంది. వీటిలో ఉండే సెన్సార్లు బాటిలోని నీళ్ళ ప్యూరిటీ కూడా చెక్ చేస్తుంది.

 

ఈ స్మార్ట్ బాటిల్ బాటిల్ లో మీరు మీకు నచ్చిన విధంగా టైం సెట్ చేసుకోవచ్చు. ఇందులో సుమారు  650 మిల్లీలీటర్ల నీటిని నిలవ చేయవచ్చు. అంతేకాదు డిస్ప్లే స్క్రీన్ , బటన్స్ కూడా ఉన్నాయి. ఈక్వా యాప్‌తో పనిచేసే ఈ వాటర్ బాటిల్ స్టెయిన్ లెస్ స్టీల్ తో తయారు చేశారు. అంతేకాదు మనం ఎంత నీటిని త్రాగామో ఎప్పటికప్పుడు మొబైల్ కి సందేశం వస్తూ ఉంటుంది కూడా. బ్లూటూత్ ఆధారంగా కూడా ఇది పనిచేస్తుంది.

 

 

 

 

 

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: