మొబైల్స్ రంగంలో ఒకప్పటి రారాజు నోకియా మళ్ళీ తన హవా కొనసాగించాలని ఉవ్విళ్ళూరుతోంది. అందుకు తగ్గట్టుగానే తన బ్రాండ్ నుంచీ ఐదు కెమెరాలతో కూడిన మొబైల్స్ ని మార్కెట్ లోకి విడుదల చేస్తానని ప్రకటించింది. ఆ ప్రకటన మొదలు ఎంతో మంది ఆ లేటెస్ట్ నోకియా మొబైల్ కోసం వేచి చూస్తున్న తరుణంలో తాజగా నోకియా తన సరికొత్త పెంటా కెమెరా నోకియా 9 ప్యూర్ వ్యూ ని విడుదల చేసింది.

 Image result for nokia 9 pureview

అతి త్వరలో ఈ మొబైల్ భారత మార్కెట్ లో విడుదల కానుందని నోకియా తెలిపింది. హెచ్‌ఎండీ గ్లోబల్‌ ద్వారా  స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్లోకి మళ్ళీ ఎంట్రీ ఇచ్చిన నోకియా ఈ సారి అదిరిపోయే ఫోన్ల తో వినియోగదారులని ఆకట్టుకుంటోంది. గతంలో ప్రకటించినట్టుగానే 12 మెగా పిక్సెల్ సామర్థ్యమున్న  5 ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్ కెమెరాలతో నోకియా 9 ప్యూర్ వ్యూ స్మార్ట్‌ఫోన్ మొబైల్ మార్కెట్ లోకి విడుదల కానుంది. ఈ మొబైల్ ధర 50 వేల వరకూ ఉండచ్చని అంచనాలు వేస్తున్నారు.

 Image result for nokia 9 pureview

ఇక ఈ మొబైల్ ఫోన్ కి సంభందించిన ఫీచర్స్ విషయానికి వస్తే..

 6 అంగుళాల క్యూహెచ్‌డీ డిస్‌ప్లే

స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్

4150 ఎంఏహెచ్ బ్యాటరీ

12 ఎంపీ పెంటా రియర్‌ కెమెరా

8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ 

20 ఎంపీ సెల్ఫీ కెమెరా

ఆండ్రాయిడ్ 9 పై ఆపరేటింగ్ సిస్టమ్‌

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: