వైరస్ దీని ప్రభావం ఎలా ఉంటుందో నిపుణులకి బాగా తెలుసు. ఈ వైరస్ ఫోన్స్, ల్యాప్టాప్, మొదలు డివైస్ లలోకి చేరితే ఎలాంటి ప్రభావం చూపుతుందో అందరికి తెలిసిందే అయితే. తాజాగా వైరల్ అవుతున్న ఓ న్యూస్ ప్రకారం మీరు గనుకా మీ వాట్సప్ ని అప్డేట్ చేసుకోక పొతే ఓ వైరస్ మీ వాట్సప్ లో చేరి మీ గుట్టు అంతా రట్టు చేస్తుందంట. మరి ఆ వైరస్ ఏమిటి..?? దానివల్ల మనకి వచ్చే ప్రమాదం ఏమిటి అనే వివరాలలోకి వెళ్తే..

 Image result for whatsapp virus

వాట్సాప్ కమ్యూనికేషన్‌ ప్రోగ్రామ్‌ ద్వారా ఒక స్పై వేర్‌ కొన్ని మొబైల్ ఫోన్లలోకి ప్రవేసిస్తోందని కంపెనీ తాజాగా వెల్లడించింది. ఇజ్రాయెల్‌కు చెందిన ఎన్‌ఎస్‌వో గ్రూప్‌ అనే అడ్వాన్స్‌డ్‌ సైబర్‌ యాక్టర్‌ దీన్ని రూపొందిచినట్టుగా వాయిస్‌కాలింగ్‌ ద్వారా మొబైల్ టార్గెట్ చేసిందని చెప్పిన వాట్సప్  గ్లోబల్‌ 1.5 బిలియన్ల యూజర్లు వెంటనే తమ యాప్‌ను వెంటనే అప్డేట్ చేసుకోవాలని సూచించింది.  

 Image result for whatsapp virus

ఇజ్రాయెల్‌ కంపెనీ తయారు చేసిన ఈ అత్యంత శక్తివంతమైన సైవేర్ స్మార్ట్‌ఫోన్‌ లని హ్యాక్ చేస్తోంది. ఫోన్ల కెమెరాలని సైతం నియంత్రించ గల సామర్ధ్యం ఉన్న ఈ వైరస్ ని ముఖ్యంగా  జర్నలిస్టులు, లాయర్లు, మానవహక్కుల కార్యకర్తల ఫోన్లను హ్యాక్‌ చేయడానికి ఉపయోగిస్తున్నారట. ఇటీవల హత్యకు గురైన జర్నలిస్టు  ఖషోగ్గీ  హ్యతలో ఈ స్పైవేర్‌ పాత్ర ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఇవి ఐఫోన్లను, గూగుల్ ఆం‍డ్రాయిడ్‌, శామ్సంగ్ టైజెన్‌ సిస్టం ఫోన‍్లను లక్ష్యంగా చేసుకుందని తెలుస్తోంది.

 


మరింత సమాచారం తెలుసుకోండి: