దేశీయ టెలికాం రంగంలో జియో ఓ సంచలనమనే చెప్పాలి. ఎన్నో విప్లవాత్మకమైన మార్పులని జియో తీసుకువచ్చింది. ఎప్పటికప్పుడు సరికొత్త ఆఫర్స్ ని ప్రకటిస్తూ దిగ్గజ కంపెనీలకి సైతం వణుకు పుట్టిస్తోంది.ఎప్పటికప్పుడు జియో ప్రకటించే  ఆఫర్లు కస్టమర్లని ఎంతో ఆకట్టుకుంటున్నాయి. అయితే తాజాగా ప్రకటించిన పలు ఆఫర్లు సైతం వినియోగ దారులని ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలో ఒక సారి జియో ప్రవేశపెట్టిన ఆఫర్స్ ని పరిశీలిస్తే.

Image result for jio

రోజుకు 1.5GB 4G డేటా :

4జీ డేటా ప్లాన్ (రోజుకు 1.5జీబీ డేటా) పై రిలయన్స్ జియో ఐదు ఆఫర్లు అందిస్తోంది. జియో రీఛార్జ్ ప్యాక్స్ రూ.149, రూ.349, రూ.449, రూ.1699  ఆఫర్ చేస్తుంది. ఈ  రీఛార్జ్ ప్లాన్లపై రోజుకు యూజర్లు 1.5జీబీ 4జీ డేటాను పొందవచ్చు. ఐదు రీఛార్జ్ ప్యాక్ లపై వ్యాలిడెటీ 28 రోజులు, 70 రోజులు, 84రోజులు, 91రోజులు, 1 ఏడాది పాటు అందిస్తోంది.

 

రోజుకు 2GB డేటా :

రిలయన్స్ జియో 4జీ డేటాపై ప్రీపెయిడ్ యూజర్లకు రోజుకు 2జీబీ డేటా అందిస్తోంది. ఈ ఆఫర్ పై అన్ లిమిటెడ్ వాయిస్ కాలింగ్, రోజుకు 100 SMS లు పొందవచ్చు. రీఛార్జ్ ప్లాన్లు వరుసగా రూ.198 (28 రోజులు), రూ.398 (70రోజులు), రూ.448 (84రోజులు), రూ.498 (91రోజులు) అందిస్తోంది.

 

రోజుకు 3GB డేటా

రిలయన్స్ జియో 4జీ డేటాపై రోజుకు 3జీబీ డేటాను అందిస్తోంది. 28రోజుల వరకు కాలపరిమితి ఉంటుంది. ఈ ప్లాన్ యాక్టివేట్ చేసుకోవాలంటే.. రూ.299తో రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. రోజుకు 3జీబీ హైస్పీడ్ డేటాతో పాటు అన్ లిమిటెడ్ వాయిస్ కాలింగ్, రోజుకు 100 SMS లు పొందవచ్చు.

 

రోజుకు 4GB డేటా

రిలయన్స్ జియో అందించే ఆఫర్లలో బెస్ట్ ఆఫర్.. ఇదే.. 4జీ డేటాపై రోజుకు యూజర్లు 4GB డేటా పొందవచ్చు. ఈ ప్యాక్ యాక్టివేట్ చేసుకోవాలంటే.. రూ.509 తో రీఛార్జ్ చేసుకోవాలి. ఈ ప్లాన్ వ్యాలిడెటీ 28 రోజులు కాగా.. 112GB డేటా పొందవచ్చు.

 

 రోజుకు 5GB డేటా

డేటా ఎక్కువగా వాడే యూజర్లుకు ఈ ప్లాన్ ఎంతో బెస్ట్. స్ట్రీమింగ్ సర్వీసులను వీక్షించే యూజర్లకు ఈ ప్లాన్ వర్క్ సరిగ్గా సరిపోతుంది. 4జీ డేటా రోజుకు 5జీబీ కావాలంటే రూ.799తో రీఛార్జ్ చేసుకోవాలి. ఈ ప్లాన్ యాక్టివేట్ చేసుకుంటే.. రోజుకు 5జీబీ హైస్పీడ్ డేటాను 28 రోజుల కాలపరిమితిపై పొందవచ్చు.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: