డ్రోన్స్ అంటే మనకు గుర్తొచ్చేది, భారీ బహిరంగ సభలలో విహంగ వీక్షణం చేయడానికి వాడే సాధనాలుగా మాత్రమే మనకు తెలుసు కానీ వాటితో సుదూర ప్రాంతాలకి మందులు, ఇంజక్షన్లు వంటి అత్యవసర సేవా కార్యక్రమాలు కూడా చేయచ్చు అని ప్రూవ్ చేసింది అమెరికాకి చెందినా జిప్ లైన్ అనే సంస్థ. ఈ స రకమైన కార్యక్రమాలు చేపడుతూ ఒక్క సారిగా కోట్ల రూపాయల లాభాలని ఆర్జించింది.

 Image result for zipline drone

దాదాపు 190 మిలియన్ డాలర్ల ఆదాయాన్ని ఏడాది కాలంలో ఆర్జించింది. ఈ సంస్థ ముఖ్య ఉద్దేశ్యం ఏమిటంటే ఆపదలో ఉన్న వారికి రక్తాన్ని, రేబిస్ వ్యాక్సీన్,  వంటి అత్యవసర మందులని తక్కువ వ్యవధిలో సరఫరా చేస్తుంది. మారు మూల ప్రాంతాలకి ఈ డ్రోన్స్ చేరుకొని అక్కడ క్లినిక్స్ కి మందులు అందిస్తాయని సంస్థ తెలిపింది.  

 Related image

ఈ డ్రోన్స్ 1.75 కేజీల బరువైన వస్తువులను తీసుకువెళ్తాయని, ఎటువంటి వాతావరణ పరిస్థితులో అయినా సరే గంటకి  68 మైళ్ళ వేగంతో గాల్లోకి ఎగురుతాయని తెలిపింది సదరు సంస్థ. అమెరికాలోని నార్త్ కెరొలినా లో తమ సంస్థ కార్యకలాపాలు ప్రారంభం అవుతున్నాయని తెలిపింది.


మరింత సమాచారం తెలుసుకోండి: