డిస్కౌంట్లు, రిబేట్లు, ఆఫర్లు.. ఇప్పుడు ఏ ఫోన్ కొనాలన్నా.. అన్నీ చెక్ చేసుకుని కొనాల్సిందే.. ఏ కామర్స్ వెబ్ సైట్ తక్కువకు ఇస్తుంది.. ఏ కంపెనీ ఆఫర్లు ప్రకటించింది తెలుసుకంటే కానీ ఫోన్ కొనే పరిస్థితులు లేవు. ఇంత చేసినా మహా అయితే 2 వేలో, మూడు వేలో మిగులుతాయి. 


కానీ ఏకంగా ఇప్పుడు 60 వేల రూపాయల వరకూ తగ్గింపు ఆఫర్ ప్రకటించిందో సంస్థ.. దీని ప్రకారం.. రూ. 72 వేల విలువ చేసే ఫోన్.. ఇప్పుడు ఏకంగా రూ. 9 వేలకే లభిస్తోంది. ఫేమస్ మొబైల్ కంపెనీ హువావే కంపెనీ తన లేటెస్ట్ మొబైల్ కోసం ఈ ఆఫర్ ను ప్రకటించింది. తన తాజా మోడల్  పీ 30 ప్రోని ధరని ఈకంపెనీ భారీగా తగ్గించింది. 

పీ 30 ప్రో ఫీచర్స్ చూస్తే అదిరిపోతారు. 8జీబీ ర్యామ్/256 జీబీ మెమరీ గల ఈ ఫోన్ అసలు ధర ఇండియాలో దాదాపు రూ.71,990, ఇప్పుడు భారీగా తగ్గి కేవలం 9వేలకే లభిస్తోంది.  ట్రంప్, టెక్ దిగ్గజం గూగుల్ ఈ కంపెనీపై కన్నెర్ర చేయడమే ఇందుకు కారణంగా చెబుతున్నారు. 

ఫోన్‌పై డిస్కౌంట్‌తో పాటు కచ్చితమైన బిల్లు, గ్యారంటీ వంటీ సౌకర్యాలు ఇస్తోంది. కొనుగోలు కన్నా ముందు ఫోన్‌ని చెక్ చేసుకునే సదుపాయం కూడా ఉంది. హువావే పీ 30 ప్రో స్మార్ట్‌ఫోన్‌పై 90శాతం డిస్కౌంట్ లభిస్తున్నట్లు ఫేమస్ మ్యాగజైన్ కూడా పేర్కొంది. కొన్ని బ్రిటిష్ ఈ కామర్స్ పోర్టల్స్‌లో పీ 30 ప్రో ఫోన్‌ని కేవలం దాదాపు రూ.9వేలకే అందుబాటులో ఉంచాయి. మరి ఇంకేం త్వరపడండి..  


మరింత సమాచారం తెలుసుకోండి: