సైబర్ నేరగాళ్ళు సరికొత్త మోసాలకు తెర తీస్తున్నారు. ఎంతో సెక్యూరిటీతో కూడిన యూపీఐ యాప్స్ కూడా ఉపయోగించి బ్యాంక్ అకౌంట్లలోని సొమ్మును మాయం చేస్తున్నారు. యూపీ ఐ కస్టమర్ కేర్ నంబర్లని చెప్పి ఇంటర్నెట్లో సైబర్ నేరగాళ్ళు వాళ్ళ నంబర్లను పెడుతూ కస్టమర్లను మోసం చేస్తున్నారు.

యూపీఐ యాప్స్ ఉపయోగించే ప్రతి ఒక్కరు కొని విషయాల పట్ల అవగాహన పెంచుకోవాలి. సైబర్ నేరగాళ్ళు బ్యాంక్ అధికారులమని చెప్పి మీ మొబైల్ కు కొన్ని మెసేజ్లను పంపి ఆ పంపిన మెసేజ్ లను ఒక కొత్త నంబర్ ఇచ్చి వాళ్ళు చెప్పిన ఆ నంబర్లకు మెసేజ్ పంపమంటారు. వాళ్ళు చెప్పినట్లు చేస్తే మనకు తెలియకుండానే మన యూపీఐ వాళ్ళు ఉపయోగించే అవకాశం ఉంది.

ఇదే కాక యూపీఐలో ఉపయోగించే ఎంపిన్, పాస్ వర్డ్ ఎవరితోను ఎట్టి పర్తిస్థితుల్లోను షేర్ చేసుకోకూడదు. అలా ఎవరైనా మీ యొక్క డిటైల్స్ అడుగుతున్నారంటే వాళ్ళు ఖచ్చితంగా మోసగాళ్ళని గుర్తించాలి. ఒకవేళ అప్పటికే మీ డిటైల్స్ షేర్ చేసి ఉంటే వెంటనే బ్యాంక్ అధికారుల్ని సంప్రదించి తగిన చర్యలు తీసుకోవాలి


మరింత సమాచారం తెలుసుకోండి: