రిలయన్స్ రంగ సంస్థ ముబైల్ రంగంలో చాలా తక్కువ ధరకు గతంలో ఫోన్లు అందించిన విషయం అందరికి తెలిసిందే. తర్వాత టెలికాంలో ఇతర కంపెనీలు వసులు చేస్తున్న విధానాలను అరికట్టేందుకు నెట్ వర్క్ టవర్లు ఏర్పాటు చేసి చార్జీలు తగ్గించింది. ప్రస్తుతం అన్ని టెలికాం సంస్థలు నెట్ వినియోగదారులకు చుక్కుల చుపిస్తున్న తరుణంలో జియో సిమ్ లాంచ్ చేసి అతి తక్కువ ధరకు ఇంటర్ నెట్ ను వినియోగదారుల ముందుంచుంది. ఇప్పుడు మరో సరికొత్త ప్రయోగానికి తెర తీసింది జియో..

జియో లాంఛింగ్ సందర్భంగా కేవలం రూ.1500లకు సాధారణంగా నెట్ వాడుకునేందుకు ఫోన్లు అదించింది. ఇప్పుడు జియో ఫోన్2 లను మార్కెట్లోకి తీసుకొచ్చి, అత్యంత చౌకైన ధరలో  4G తో అందించింది. మరొకసారి, ఇదేవిధంగా మరొక షాక్ ఇవ్వడనికి సిద్ధమవుతోందేమో అని అనిపిస్తుంది . ఎందుకంటే , ప్రస్తుతం వస్తున్నకొన్నిరూమర్లు మరియు రిపోర్టుల ప్రకారంగా చూస్తుంటే, ఈ సంవత్సరం జూన్ నెలలో ఒక ఫోన్ను, జియో ఫోన్ 3 గా మార్కెట్లోకి తీసుకురాబోతున్నదని తెలుస్తోంది.

అయితే  ఇందులో ఆశ్చర్యపడటానికి ఏముందంటారా? అవును ఆశ్చర్యపడి విషయమే, ఎందుకంటే, ఇప్పటి వరకు ఫీచర్ ఫోన్ వరకు మాత్రమే పరిమిత మినా జియో, ఇప్పుడు ఒక పెద్ద 5 అంగుళాల టచ్చ్ స్క్రీన్ తో కూడిన ఫోన్లను మార్కెట్లోకి తీసుకొచ్చే ఆలోచనలో ఉందికాబట్టి. అంతేకాదు,ఈ ఫోన్ను ఒక 2 GB ర్యామ్ మరియు 64 GB స్టోరేజితో తీసుకురానున్నట్లు ప్రస్తుతం వస్తున్నా రూమర్ల ద్వారా తెలుస్తోంది.     

జియో ఫోన్3 స్పెసిఫికేషన్స్
ఒక అనామక జియో ఎగ్జిక్కుటివ్ తెలిపిన ప్రకారం, ఈ సంస్థ జియో ఫోన్ను ఒక 5- అంగుళాల టచ్చ్ స్క్రీన్ డిస్ప్లేతో ప్రకటించనున్నదని తెలుస్తోంది. ఈ హ్యాండ్సెట్ ఒక 2GB ర్యామ్ మరియు 64GB అంతర్గత స్టోరేజితో రానున్నట్లు చెప్పబడుతోంది. ఇక్కడ చెప్పినదంతా నిజంగా జరిగితే, ముందుగా వచ్చిన 2.4 ఇంచ్ స్క్రీన్ మరియు 4GB స్టోరేజి నుండి ఒక్కసరిగా గణనీయమైన మార్పుకు జియో జంప్ చేయనున్నట్లు చెప్పుకోవచ్చు. అలాగే, ముందుగా వచ్చిన జియో ఫోన్ల వలెనే మెమోరిని పెంచుకునేవేలును కూడా కల్పిస్తుందని అంచనావేయవచ్చు. ఇక కెమేరాల పరంగా కూడా ఇది బాగానే ఉండవచ్చని అర్ధమవుతుంది. ఇది ఒక 5MP వెనుక కెమెరా మరియు ముందు 2MP సెల్ఫీ కెమేరాతో తో ఉండవచ్చు. అయితే, దీని OS గురించి ఎటువంటి సమాచారం లేదు. కానీ, KaiOS పూర్తి ప్రధాన వెర్షన్ లేదా గూగుల్ యొక్క తేలిక పాటి వెర్షన్ అయినటువంటి Android Go OS ఉండవచ్చని అంచనావేస్తున్నారు.

జియోఫోన్ 3 అంచనా ధర మరియు అందుబాటు
ఈ నివేదిక ప్రకారం, ఒకవేళ ఈ జియోఫోన్ పైన తెలిపిన అప్డేట్స్ తో కనుక వచ్చినట్లయితే, ఇది 1500 మరియు 2999 ధరలతో వరుసగా విడుదలైనటువంటి జియోఫోన్ మరియు జియోఫోన్2 కంటే ఎక్కువ ధరతో ఉండవచ్చు. ఈ జియోఫోన్3 రూ.4,500 ధరతో ఉండవచ్చని అంచనా మరియు ముందు ఫోన్లా మాదిరిగానే ఎక్స్చేంజి ప్రోగ్రామ్ కూడా ఇవ్వవచ్చని తెలుస్తోంది. ఇక లాంచ్ డేట్ విషయానికి వస్తే, ఈ జియోఫోన్3 అధికారికంగా జూన్ నెలలో ప్రీ ఆర్డర్ల కోసం రావచ్చని, వీటి యొక్క సేల్ ఆగష్టు నుండి ప్రారంభంకావచ్చని అంచనాలను ఈ రిపోర్ట్ తెలిపింది.


మరింత సమాచారం తెలుసుకోండి: