స్మార్ట్‌ఫోన్లు వ‌చ్చాకా నోకియా ఫోను ప‌రిస్థితి దిగాలు ప‌డింది. అధునాత‌న ఫీచ‌ర్లు ఇస్తున్న స్మార్ట్ ఫోన్ల‌ను ఢీకొనేందుకు ప్ర‌ముఖ మొబైల్ సంస్థ  నోకియా బెస్ట్ ఫీచ‌ర్ల‌ను వినియోగ‌దారుల‌కు అందిస్తుంది. తాజాగా నోకియా నుంచి జాలువారింది నోకియా 2.2 మొబైల్. అంద‌రికీ అందుబాటులో ఉండేందుకు రూపొందించిన ఈ బ‌డ్జెట్ ఫోన్ భార‌త్ మార్కెట్లోకి విడుద‌లైంది.

అయితే నోకియా 2.2 ఫోను రెండు విధాలుగా రూపొందించ‌బ‌డింది. 2జీబీ ర్యామ్‌+16జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌ ఉన్న మొబైల్‌ ధర రూ.6,999. అదేవిధంగా 3జీబీ+32జీబీ ధర రూ.7,999. మ‌రో విశేషం ఏంటంటే నోకియా 2.2 ఫోను  ప్ర‌ముఖ నెట్‌వ‌ర్క్ సంస్థ జియో త‌మ వినియోగదారులకు రూ.2,200 విలువైన క్యాష్‌బ్యాక్ అందించ‌నుంది, అందులో భాగంగా 100జీబీ డేటా ఉచితంగా లభించనుంది. అయితే ఈ ఆఫ‌ర్లు  రూ.198, రూ.299 రీఛార్జ్‌లపై మాత్రమే క్యాష్‌బ్యాక్ ల‌భ్య‌మ‌వుతుంది.


నోకియా 2.2 ఫీచ‌ర్స్  ఇవే
5.71 హెచ్‌డీ+ డిస్‌ప్లే
2జీబీ+16జీబీ, 3జీబీ+32జీబీ వేరియంట్
వెనుయ కెమెరా 13 మెగాపిక్సెల్‌
ముందు కెమెరా  5మెగాపిక్సెల్‌
ఆండ్రాయిడ్‌ 9.0
3000 ఎంఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యం


మరింత సమాచారం తెలుసుకోండి: