లేటెస్ట్‌ మోడల్‌ విమానం హైదరాబాద్‌ కు వచ్చింది. గురువారం తెల్లవారుజామున 4.00 గంటల సమయంలో ఎతిహాద్‌ ఎయిర్‌ వేస్‌ కు చెందిన 787-10 డ్రీమ్‌ లైనర్‌ సర్వీస్‌ తొలిసారి హైదరాబాద్‌ ఎయిర్‌ పోర్ట్‌ లో దిగింది. 


ఈ సూపర్‌ ఫ్లైట్‌ రాకతో శంషాబాద్‌ లోని రాజీవ్‌ గాంధీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ పోర్ట్‌ లో సందడి నెలకొంది. విమానాన్ని చూడటానికి ప్రయాణికులు క్యూ కట్టారు. ఇది అబుదాబి నుంచి హైదరాబాద్‌ కు వచ్చింది. 787 సిరీస్‌ లో 787-10 విమానం లేటెస్ట్‌ వర్షన్‌. దీని పొడవు 68 మీ. రెక్కల పొడవు 60 మీ. ఎత్తు 17 మీ. దీనిలో 330 ప్రయాణికులు ప్రయాణించవచ్చు. 


ఈ విమానం ఆగకుండా 11,910 కి.మీ. ప్రయాణించగలదు. ఈ ఫ్లైట్‌ రావడానికి అరగంట ముందు విమానాశ్రయానికి విమానం గురించి సమాచారం అందింది. అయితే ఎయిర్‌ పోర్ట్‌ లో 787-10 విమానం దిగడానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లూ ఉండటం వల్ల, విమానం దిగేందుకు అనుమతి ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: