బానిస బ్రతుకు మనకెందుకు అంటూ కధం తొక్కిన భారత్ లాంటి పోరాట దేశంలో కేవలం ఒకే ఒక్క యాప్ కి భారతీయులు అందరూ బానిసలుగా బ్రతుకుతున్నారట. ఇప్పటికే ఆ యాప్ ఏమిటో అందరికి అర్థం అయ్యి ఉంటుంది. టిక్ టాక్ ఇప్పుడు ప్రపంచాని పట్టి పీడిస్తున్న అతిపెద్ద సమస్య, దీనివల్ల కుటుంభాలకి కుటుంభాలు చెల్లా చెదురు అయ్యాయంటే ఆశ్చర్యపడక మానరు. పెళ్ళాలని చంపేసిన భర్తలు, టిక్ టాక్ వాడద్దు అన్నారని పురుగులు మందులు తాగి చనిపోయిన వాళ్ళు ఇలా ఎంతో మంది టిక్ టాక్ కి భానిసలు అయ్యారు.

 Image result for tik tok addicted indians

భారత దేశంలో మాత్రం ఇది మరీ విపరీతంగా విస్తరించింది. సుమారు 12 కోట్ల మంది ఈ టిక్ టాక్ కి బానిసలుగా మారిపోయారంటే నమ్మసక్యంగా లేదు కదూ. ఇది నిజం, ప్రపంచ వ్యాప్తంగా ఈ యాప్ ని 100 కోట్ల మంది వినియోగిస్తుంటే కేవలం భారత్ లో 30 కోట్ల మంది వినియోగించడం షాక్ కి గురిచేస్తోంది. తాజా అధ్యయనం ప్రకారం చూస్తే

 Image result for tik tok addicted

తాము చేసిన వీడియోలని టిక్ టాక్‌లో పోస్టు చేసి., 12 కోట్ల మంది లైక్‌ల కోసం వేచి వుంటే.. ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వారు అనేకమంది ఉన్నారని, లక్షల్లో కౌన్సిలింగ్ కోసం ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారని ఈ అధ్యయనం తెలిపింది. ముంబై, ఢిల్లీ నగరాల్లో  టిక్ టాక్ సంస్థకు చెందిన కార్యాలయాలు ఉన్నాయి. ఇందులో దాదాపు 500 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. టిక్ టాక్ పై ఎన్నో విమర్శలు రావడంతో సదరు సంస్థ 13 విధివిధానాలను అమలు చేసింది. అయినా ఎటువంటి ఉపయోగం లేకపోవడం గమనార్హం. తమిళనాడులో అయితే ఈ యాప్ ని నిషేధించాలని డిమాండ్ రోజు రోజుకి పెరుగుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: