గూగుల్ పే గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి. ఎటువంటి బిల్లు కట్టాలన్నా, ఒకరి బ్యాంక్ ఖాతాకి మరొకరు డబ్బులు పంపాలన్నా , ఇలా రకరకాలుగా నుంచున్న చోట నుంచీ సమస్తం సమకూర్చి పెట్టి అందరిని ఆకర్షిస్తోంది ఈ యాప్. అంతేకాదు ఈ యాప్ నుంచీ ఏ విధంగా డబ్బు లావాదేవీలు చేసినా విలువైన స్క్రాచ్ కార్డ్స్ వచ్చి అదృష్టాన్ని పరీక్షిస్తాయి. ఇప్పుడు ఇదే రీతిలో

 Image result for google pay tez shot cricket

గూగుల్ పే సంస్థ తన యూజర్లకు చక్కని అవకాశం కలిపించింది. తన యాప్ లో కొత్తగా ప్రవేశ పెట్టిన  ఆ తేజ్ షాట్స్ అనే ఓ మినీ గేమ్‌ను ఆది అందులో భారీ స్కోర్ చేస్తే అందుకు తగ్గట్టుగా విలువైన స్క్రాచ్ కార్డ్స్ అందిస్తోంది.  ఈ గేమ్‌లో 100 రన్స్ కొడితే రూ.50, 500 రన్స్ కొడితే రూ.100, 1000 రన్స్ కొడితే రూ.150, 2000 రన్స్ కొడితే రూ.1000, 3000 రన్స్ కొడితే రూ.2000 విలువైన స్క్రాచ్ కార్డులు వస్తాయి.

 Image result for google pay tez shot cricket

అయితే ఈ కార్డ్స్ ఉపయోగించాలి అంటే మాత్రం తప్పకుండా ఈ స్క్రాచ్ కార్డును అన్‌లాక్  చేయాలి. అలా చేయాలంటే అక్కడ సూచించే విధంగా యూజర్స్ ట్రాన్సాక్షన్ పూర్తి చేయాల్సి ఉంటుంది. దీంతో ఈ స్క్రాచ్ కార్డు అన్‌లాక్ అవుతుంది. దాంతో రివార్డ్ పొందవచ్చు. ఈ ఆఫర్‌ కేవలం  జూలై 31 వరకూ మాత్రమే అందుబాటులో ఉంటుందని సంస్థ తెలిపింది.


మరింత సమాచారం తెలుసుకోండి: