మనిషిని పోలిన మనుషులు 7ఉంటారు అంటారు పెద్దలు అలాంటప్పుడు అసలు మనిషిని గుర్తుపట్టడం కాస్త కష్టమే,ఒకప్పుడు పుట్టుమచ్చల,పచ్చబొట్లు ఆధారంగా గుర్తించే వాళ్ళు,కాస్త పరిజ్ఞానం పెరిగాక వేలిముద్రలతో మనిషుల్ని గుర్తించారు ఈ పద్ధతిని "బయోమెట్రిక్" అంటారు.

తర్వాత కంటి రెటీనాల ను గుర్తించి మనుషుల్ని గుర్తించేవారు ఈ పద్ధతిని "ఐరిస్" అంటారు.క్రిమినల్ కేసుల్లో చనిపోయిన వాళ్ళ ఆనవాళ్ళు కనుగొనడం అనేది పెద్ద సవాల్ అలాంటి వాటికి డిఎన్ఏ టెస్ట్ చేసి వ్యక్తిని కనుక్కుంటారు,

ఇలా రకరకాల పద్దతిలో వ్యక్తుల ఐడెంటిటీ ని గుర్తించే పద్ధతులు మాత్రమే ఇప్పటివరకు మనకు తెలుసు కానీ గుండె చప్పుడు ఆధారంగా మనిషి ఐడెంటిటీ కనుగొనే టెక్నాలజీ గురించి మీకు తెలుసా.అమెరికాకు చెందిన పెంటగాన్

నిఘా వ్యవస్థ ఈ సరికొత్త విధానాన్ని రూపొందించింది.అత్యాధునిక సాంకేతికతతో ఓ లేజర్ తయారు చేసింది.జెట్ సన్ గా పిలిచే ఈ లేజర్ 200మీటర్ల దూరంలో ఉన్న వ్యక్తి గుండె చప్పుడు ఆధారంగా వ్యక్తిని స్పష్టంగా గుర్తు పడుతుంది.అమెరికా ప్రత్యేక దళాల కోసం పెంటగాన్ దీన్ని తయారు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: