వాట్సాప్‌, ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌లో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో ఫొటో, ఆడియో సందేశాలు ఇతరులకు వెళ్లడంలో కాసేపు అంతరాయం నెలకొంది. యూరోప్‌, యూఎస్‌ఏ, ఆఫ్రికాలో ఈ సమస్య మొదలైంది. సాంకేతిక లోపం లేదా సైబర్‌ ఎటాక్‌తో ఈ సమస్య నెలకొని ఉంటుందని భావిస్తున్నారు. కాగా భారత్‌లో ఈ సమస్య సత్వరం పరిష్కరించటమైంది.


అయితే వాట్సాప్‌, ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌ పనిచేయడం లేదని వినియోగదారులు నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తున్నాయి. దీంతో కొద్ది క్షణాల్లోనే యాప్‌ వైఫల్యాల సూచీ భారీగా పెరిగిపోయింది. ఆస్ట్రేలియా, బ్రెజిల్, కొలంబియా, జపాన్‌, మెక్సికో, ఫిలిప్పీన్స్‌, రష్యా, సింగపూర్‌ తదితర దేశాల నుంచి కూడా ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.


భారత్‌లోనూ కొన్ని ప్రాంతాల్లో ఈ సమస్య ఏర్పడింది. మరికొన్ని ప్రాంతాల్లో మొబైల్‌లో వాట్సాప్ పనిచేస్తున్నా డెస్క్‌టాప్‌ వెర్షన్‌ మాత్రం మొరాయిస్తోంది. ప్రజల దైనందిన జీవితంలో ప్రముఖ స్థానాన్ని ఆక్రమించిన వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ స్తంభించే సరికి వినియోగదారులు విలవిలలాడుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: