వాట్స‌ప్ ఎప్ప‌టిక‌ప్పుడు త‌న వినియోగ‌దారుల‌కు కొత్త కొత్త ఫీచ‌ర్ల‌ను ప‌రిచ‌యం చేస్తుంటుంది. అదే క్ర‌మంలో త్వ‌ర‌లో మ‌రికొన్ని కొత్త ఫీచ‌ర్ల‌ను అందించనుంది. వాటిలో ఫ్రీక్వెంట్లీ ఫార్వ‌ర్డ్‌, హైడ్ మ్యూటెడ్ స్టేట‌స్‌, డార్క్‌మోడ్ ఇలా కొత్త ఫీచ‌ర్లు రాబోతున్నాయి. వీటిని మొద‌ట బీటా యూజ‌ర్ల‌కు అందించింది. వాటిని ప‌రిశీలించి వినియోగ‌దాలులు ఫీడ్‌బ్యాక్ తీసుకున్న త‌ర్వాత మార్పులూ చేర్పులూ చేసి, మిగ‌తా వినియోగ‌దార్ల‌కు అందించ‌నుంది.


ఫ్రీక్వెంట్లీ ఫార్వ‌ర్డ్‌: ఇటీవ‌ల ఫేక్‌న్యూస్ పెద్ద స‌మ‌స్య‌గా మారిన విష‌యం తెలిసిందే. ఒకే మెసేజ్ కొన్ని నెల‌ల పాటు స‌ర్క్యులేట్ అవుతూనే ఉంటుంది. ఈ ఫీచ‌ర్ ద్వారా అలాంటి మెసేజెస్‌ను సులువుగా గుర్తించొచ్చు. అందుకోస‌మే ఫ్రీక్వెంట్లీ ఫార్వ‌ర్డెడ్ ఫీచ‌ర్ తీసుకొస్తోంది. ఒక మెసేజ్ ఎన్నిసార్లు ఫార్వ‌ర్డ అయిందో కూడా ఈ ఫీచ‌ర్ ద్వారా తెలుసుకోవ‌చ్చు. ఇక మెసేజ్ నాలుగుసార్లు క‌న్నా ఎక్కువ ఫార్వ‌ర్డ్ అయిన‌ట్లైతే దాన్ని `ఫ్రీక్వెంట్లీ ఫార్వ‌ర్డెడ్‌` మెసేజ్‌గా భావిస్తారు. ప్ర‌స్తుతం భార‌త్‌లో ఒక మెసేజ్‌ను ఐదుగురిక‌న్నా ఎక్కువ మందికి ఫార్వ‌ర్డ్ చేయ‌లేరు.


హైడ్ మ్యూటెడ్ స్టేట‌స్: వాట్స‌ప్‌లో ఎవ‌రైనా స్టేట‌స్ అయినా మ‌న‌కు న‌చ్చ‌క‌పోతే, అలాంటి స్టేట‌స్‌ల‌ను మ్యూట్ చేసే ఆప్ష‌న్ ప్ర‌స్తుతం ఉంది. అయితే.. ఇప్పుడొస్తున్న కొత్త ఆప్ష‌న్ ద్వారా ఆ స్టేట‌స్‌ను హైడ్ చేయ‌వ‌చ్చు. ఆ త‌ర్వాత మ‌ళ్లీ కావాలంటే `షో` ఆప్ష‌న్ సెలెక్ట్ చేసుకోవ‌డం ద్వారా క‌నిపించేలా చేయొచ్చు.


షేర్ వాట్స‌ప్ స్టేట‌స్: మీ వాట్స‌ప్ స్టేట‌స్‌ను డైరెక్ట్‌గా ఫేస్‌బుక్ స్టోరీస్‌గా మార్చేందుకు ఈ ఫీచ‌ర్ ఉప‌యోగ‌ప‌డుతుంది. మీరు ఈ వాట్ప‌ప్‌లో ఏద‌నా స్టేట‌స్ పెడితే.. అదే స్టేట‌స్‌ను ఫేస్‌బుక్‌లోకి షేర్ చేయొచ్చ‌న్న మాట‌.


డార్క్ మోడ్: చాలాకాలంగా వాల్స‌ప్ వినియోగ‌దారులు ఎదురుచూస్తున్న ఫీచ‌ర్ ఇది. ఇప్ప‌టికే అనేక యాప్స్‌లో డార్క్ మోడ్ ఫీచ‌ర్ ఉంది. త్వ‌ర‌లో ఈ ఫీచ‌ర్ యూజ‌ర్లంద‌రికి రానుంది.


ఫింగ‌ర్ ప్రింట్ లాక్: లాక్ చేసిన వాట్స‌ప్‌ని ఓపెన్ చేయాలంటే పాస్‌వ‌ర్డ్ త‌ప్ప‌నిస‌రి. అదేవిధంగా ఫింగ‌ర్‌ప్రింట్ ద్వారా కూడా వాట్ప‌ప్ ఓపెన్ చేసే ఫీచ‌ర్ త్వ‌ర‌లో రానుంది. మీరు సెక్యూరిటీ లాక్ సెట్ చేసుకున్నా మీ ఫింగ‌ర్ ప్రింట్‌తో వాట్ప‌ప్ అన్‌లాక్ చేయొచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: