ఒకప్పుడు రోజులు వేరు ప్ర‌స్తుతం టెక్నాల‌జీ పెరిగిన త‌ర్వాత మ‌నుషుల తీరు వేరుగా ఉంటుంది. మ‌నం ఎదిగేకొద్ది మ‌న‌కంటే ముందే ఒక అడుగు టెక్నాల‌జీ ఎదుగుతుంది. అప్ప‌ట్లో రాత్రి పడుకునే ముందు ఏదన్నా బుక్ చదివి పడుకునేవారు,ఉదయం లేవగానే మనకి నచ్చిన వాళ్ల మొఖం చూడడమో లేదంటే దేవుడి మొఖం చూడడమో చేసేవారు.కానీ ఇప్పుడు ఉదయం లేచింది మొదలు ,రాత్రి పడుకునే వరకు ఒకటే ధ్యాస..అదేనండి స్మార్ట్ ఫోన్ ధ్యాస..ప్రతి దానికి ఫోన్లో  తల దూర్చడమే..మన పక్కన ఏం జరుగుతుందో కూడా పట్టించుకోనంత గా అందులో మునిగిపోతున్నాం..మొత్తంగా చూసుకుంటే స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంటే ఈ ప్రపంచమే మన చేతిలో ఉన్నట్టుగా ఫీలవుతున్నాం.


గ్రహంబెల్ టెలిపోన్ కనుగొన్నాడు ..తర్వాత కార్డ్ లెస్ ఫోన్స్ వచ్చాయి.తర్వాత సెల్ ఫోన్స్ వచ్చాయి అని మనకు తెలుసు కాని మనకు తెలియని విషయం  ఏంటంటే 80ఏళ్ల క్రితమే స్మార్ట్ ఫోన్లు ఉన్నాయని..అవునండి ఆ విషయాన్ని నిరూపిస్తు  ఓ అమెరికన్‌ పెయింటింగ్‌ నిరూపిస్తోంది.ఇప్పుడు మనం మస్సాచుసెట్ట్స్‌ పట్టణంగా చెప్పకుంటున్న ప్రాంతంను నిర్మాణకర్త అయిన విలియం పించోన్ గుర్తుగా గీయబడిందే ఈ ఆర్ట్.దాని పేరు ‘మిస్టర్‌ పించోన్‌ అండ్‌ ది సెట్టింగ్ ఆఫ్‌ స్ప్రింగ్‌ ఫీల్డ్’..   ఉంబెర్టో రొమానో అనే చిత్రకారుడు 1937 లో ఓ మురల్‌(గోడ మీద పెయింటింగ్‌) ను గీశారు. ఆ చిత్రాన్ని గమనిస్తే పించోన్‌(పింక్‌ రంగు సూట్‌)కు ఎడమ వైపుగా ఓ రెడ్‌ఇండియన్‌ తెగకు చెందిన వ్యక్తి సెల్ఫీ దిగినట్లు ఉండడంతో 80 ఏళ్ల క్రితమే స్మార్ట్ ఫోన్‌లు ఉన్నాయంటూ మదర్‌బోర్డ్‌ అనే ఓ మాగ్జైన్‌ ఆర్టికల్‌ ప్రచురించింది.


ఇప్పుడు పించోన్ పెయింటింగ్ లో స్మార్ట్ ఫోన్ ఆనవాళ్లు బయటపడడం మొదటి సారి కాదు..  ఆపిల్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ టీమ్‌ కుక్‌ అమ్‌స్టర్‌డ్యామ్‌ పర్యటన సందర్భంగా రిజిక్స్‌ మ్యూజియంను సందర్శించినప్పుడు 17వ శతాబ్దానికి చెందిన ఓ పెయింటింగ్‌లో చేతిలో ఐఫోన్‌ మాదిరి వస్తువును పట్టుకుని ఉన్న మహిళ ఫోటోను గమనించి వెలుగులోకి తెచ్చిన విషయం తెలిసిందే. దాంతో కొందరు కాలగమన సిద్దాంతాన్ని వెలుగులోకి తెస్తున్నారు. ఆ సమయంలో స్మార్ట్ ఫోన్‌లు ఉన్న మాట వాస్తవమేనని కొందరు వాదిస్తుండగా, మరికొందరు ఆ వాదనను కొట్టిపారేస్తున్నారు.., బహుశా అది అద్దం లాంటి వస్తువేదైనా అయి ఉంటుందని చెబుతున్నారు.


ఏది ఏమైన‌ప్ప‌టికీ ప్ర‌స్తుతం రోజుల్లో స్మార్ట్ ఫోన్ అనేది ప్ర‌తి ఒక్క‌రికీ చాలా ముఖ్య‌మైపోయింది. కొంద‌రు దాన్ని మంచి వాడుతున్నారు. మ‌రికొంద‌రు మిస్‌యూజ్ కూడా చేస్తున్నారు.  కాక‌పోతే టెక్నాల‌జీ అనేది ఎంత పెరిగినా మాన‌వ సంబంధాల‌ను మ‌ర్చిపోకూడ‌దు. ఒక ఫోన్‌లో మ‌నం గ‌మ‌నించే విష‌యాల‌క‌న్నా ఏదైనా ఒక సంద‌ర్భం గురించి ఒక వ్య‌క్తితో మ‌రో వ్య‌క్తి  చ‌ర్చించుకోవ‌డం వ‌ల్ల మాన‌వ‌సంబంధాలే కాకుండా చాలా విష‌యాలు తెలుస్తాయి అంటున్నారు మ‌న పెద్ద‌లు.


మరింత సమాచారం తెలుసుకోండి: