రాష్ట్రంలో రోజు రోజుకు సైబర్ మోసాలు అధికవుమవుతున్నాయి. చదువుకున్న వారితో పాటు చదువుకోని వారు కూడా ఈ మోసాల బారిన పడుతున్నారు. ఈ మోసాలు ఏ విధంగా జరుగుతున్నాయంటే తాము బ్యాంక్ ప్రతినిధులమని మీ ఏటీఎం కార్డు బ్లాక్ కాబోతుందని మీ కార్డు మీద ఉన్న 16 నంబర్లు, వెనుక ఉన్న మూడు నంబర్లు(సీవీవి నంబర్) చెప్పాలని ఖాతా దారులకు ఫోన్ చేసి అడుగుతున్నారు. నిజంగా కార్డు బ్లాక్ అవుతుందేమో అని కొందరు అమాయకులు ఈ నెంబర్లు చెప్పి మోసపోతున్నారు. 
 
మరి కొంత మంది ఖాతాదారులకు ఫోన్ చేసి మీ ఖాతా ఇక ముందు పని చేయదని పని చేయాలంటే మీ మొబైల్ నంబర్ కు వచ్చే ఓటీపీ (వన్ టైమ్ పాస్వర్డ్) చెప్పాలని అడుగుతున్నారు. ఎంతో సెక్యూరిటీతో కూడిన యూపీఐ అప్లికేషన్ల ద్వారా కూడా కొందరు మోసపోతూ ఉండటం విశేషం. యూపీఐ ద్వారా లావాదేవీలు నిర్వహిస్తున్న వారు ఏవైనా ఇబ్బందులు ఎదువరవుతుంటే కస్టమర్ కేర్ నంబర్ల కోసం సెర్చ్ ఇంజన్లలో చూసి అప్పటికే కొంతమంది మోసగాళ్ళు పెట్టిన ఫేక్ కస్టమర్ నంబర్లకు కాల్ చేసి మోసపోతున్నారు. 
 
మరో విధమైన మోసం ఏమిటంటే బ్యాంకు ఖాతాలు ఉన్న ఖాతాదారులకు ఫోన్లు చేసి 'ఎనీ డెస్క్ ' అనే అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోమని ఆ అప్లికేషన్లో కనిపించే 9 అంకెల నంబర్ చెప్పమని మీ మొబైల్ ఫోన్ వాళ్ళ కంట్రోల్ లోకి తెచ్చుకుని మోసాలు చేస్తున్నారు. బ్యాంక్ ఖాతాలకు సంబంధించి ఏవైనా సమస్యలుంటే బ్యాంకుకు వెళ్ళి పరిష్కరించుకోవటం ఉత్తమమైన పని. బ్యాంకు ప్రతినిధులు ఎప్పుడూ ఖాతాదారుల యొక్క ఏటీఎం నెంబర్, పిన్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ యూజర్ నేమ్, పాస్వర్డ్లాంటి విషయాలు అడగరని గుర్తించుకోవాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: