Faceapp ఈ మధ్య కాలంలో ఈ యాప్ బాగా ప్రాచుర్యం పొందింది. 20 లలో ఉన్న వాళ్ళని 60 లలో ఎలా ఉంటారో చూపించడం ఈ యాప్ ప్రత్యేకత. అంతేకాదు 40 లలో ఉన్న వాళ్ళని 20 ల్లోకి కూడా తీసుకెళ్తుంది ఈ యాప్. ప్రపంచ వ్యాప్తంగా ఈ యాప్ కి విశేష ఆదరణ లభిస్తోంది. చిన్నా పెద్దా అందరూ ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకుని వాడటం మొదలు పెడుతున్నారు. ఇప్పటి వరకూ ఈ యాప్ కి  10 కోట్ల మంది యూజర్స్ ఉన్నారంటే ఈ యాప్ కి ఎలాంటి ఆదరణ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక్కడి వరకూ బాగానే ఉన్నా అసలు ఈ యాప్ ఎంతవరకూ సేఫ్ అనేది మాత్రం ప్రశ్న చాలా మందిలో మెదులుతోంది.

 Image result for faceapp safe or not

ఏదైనా  యాప్ ని మనం డౌన్లోడ్ చేసుకునేటప్పుడు ప్రైవసీ పాలసీ తప్పకుండా చదవాలి. కానీ అందరూ యాప్ ఇన్స్టాల్ చేసే ముందు వచ్చే పాలసీ చదవకుండా ఇన్స్టాల్ చేస్తుంటారు. అయితే ఈ Faceapp ఇన్స్టాల్ చేసే ముందు వచ్చే ప్రైవసీ పాలసీలో అసలేముంది అనేది ఒక్క సారి పరిశీలిస్తే మాత్రం మీరు ఆ యాప్ ఇన్స్టాల్ చేయరు. ఇంతకీ ఆ పాలసీలో ఏముంది..??

 Image result for faceapp safe or not

ఈ యాప్ వాడటం మంచిది కాదని టెక్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. మీ కంటెంట్ ని షేర్ చేసేందుకు  కంటెంట్‌ని షేర్ చేసేందుకు Faceapp  కి యాక్సెస్ లభిస్తుంది, అంతేకాదు మీ పేరు, కుకీస్, లొకేషన్ డేటా ,వంట వివరాలు వ్యాపార సంస్థలకి షేర్ చేసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఈ యాప్ సర్వర్లు లాగ్ ఫైల్ ఇన్ఫర్మేషన్ ఆటోమేటిక్ గా యాక్సెస్ చేసుకుంటాయి. మీరు అప్లోడ్ చేసిన ఫోటోలు ఫేస్ యాప్ ఎప్పుడైనా, ఎక్కడినా ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. అందుకు మీరు ఈ యాప్ కి అనుమతి ఇచ్చినట్టే. ఈ విషయాలని ఈ యాప్ డెవలప్ చేసిన వైర్లెస్ ల్యాబ్  కంపెనీ చెబుతోంది.  ఈ యాప్ కదలికల పై అమెరికా అత్యత్తమ దర్యాప్తు సంస్థలు అయిన FBI, FTC  దృష్టి పెట్టాయంటే దీని ప్రభావం ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు అంటున్నారు టెక్ నిపుణులు.


మరింత సమాచారం తెలుసుకోండి: