ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్‌ అనేది ప్రతి ఒక్కరికీ కామన్ అయిపోయింది. ప్రతి రోజు సగటున నాలుగు గంటల స్మార్ట్‌ఫోన్‌ మీద కాలం గడుపుతున్నారని నివేదికలు వెల్లడిస్తున్నాయి. అయితే చాలామంది స్మార్ట్‌ఫోన్ లో అనవసరమైన విషయాలనే ఎక్కువ సెర్చ్ చేస్తుంటారు. సోషల్ మీడియా వచ్చినప్పటి నుండి ఇది మరింతగా సమయాన్ని వృధా చేస్తోంది. చాలా మంచి ఫీచర్లు ఉన్నా అవి ఎలా ఉపయోగించుకోవాలో తెలియడం లేదు. ఇంకా క్లుప్తంగా చెప్పాలంటే అవి ఉన్నాయనే విషయంకూడా చాలామందికి తెలియదు. అలాంటి కొన్ని ఫీచర్లను ఓ సారి తెలుసుకోండి.


- మీ ఫోన్ ని టెలిస్కోప్ గా కూడా ఉపయోగించుకోవచ్చు. ఫోన్ లెన్స్ నేరుగా టెలిస్కోప్ కు పెట్టినప్పుడు మీరు ఇమేజ్ క్యాప్చర్ చేస్తుంది.


- మీరు ఎప్పడైనా కారులో ప్రయాణం చేస్తున్నప్పుడు రూటు సరిగా తెలియకుంటే గూగుల్ మ్యాప్ ని ఆశ్రయిస్తుంటారు. అయితే అది చీకటిగా ఉన్న సమయంలో డార్క్ లోనికి వెళుతుంది. ఇలా డార్క్ లోకి వెళ్లినప్పటికీ మీరు వెలుతురు ఉండే విధంగా సెట్ చేసుకోవచ్చు. దీని కొసం మీరు Hudwayని మీ ఫోన్లో ఇన్ స్టాల్ చేసుకుంటే సరిపోతుంది.


- Instant Heart Rate ఉపయోగించి మీరు మీ హార్ట్ రేట్ తెలుసుకోవచ్చు. ఆండ్రాయిడ్ , ఐఓఎస్ రెండి సిస్టంలలో అందుబాటులో ఉంది.


- మీరు ఎక్కడైనా షాపింగ్ చేసే సమయంలె అక్కడ కనిపించే బార్ కోడ్ వివరాలను మీ మొబైల్ ద్వారా తెలుసుకోవచ్చు.USPS, UPS, and FedEx systemsలో మీరు మీ మొబైల్ స్కాన్ చేసినప్పుడు ఆ వివరాలు మీ మొబైల్ లోకి వస్తాయి. దీంతో పాటు RedLaser యాప్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు.


- HELMUT Film Scanner ఉపయోగించి మీరు ఫాంట్స్ , ప్లేస్, లాంటి వివరాలను టెక్స్ట్ ద్వారా తెలుసుకోవచ్చు.  


మరింత సమాచారం తెలుసుకోండి: