ప్ర‌పంచ వ్యాప్తంగా సోష‌ల్ మీడియా ప్ర‌భావంలో వాట్సాప్ ప్రాధ‌న్య‌త రోజు రోజుకు బాగా విస్తృతం అవుతుంది. వాట్సాప్‌లో ఎప్ప‌టిక‌ప్పుడు స‌రికొత్త ఆఫ్ష‌న్‌లు అందిస్తూ యూజ‌ర్ల మ‌న‌సుల‌ను దోచుకుంటోంది. ఈ క్ర‌మంలోనే ఇప్ప‌టికే ఎన్నో కొత్త ఆప్ష‌న్లు అందిచేసింది. అయితే ప్ర‌స్తుతం వాట్సాప్ యాప్ మ‌రో స‌రి కొత్త ఫీచ‌ర్‌ అంద‌చేయ‌నుంది. 


స‌హ‌జంగా  వాట్స్ యాప్ లో వీడియో అయినా, టెక్ట్స్ మెసేజ్ అయినా, ఫార్వార్డ్ చేసే ముందు పరిశీలించుకునే అవకాశం ఉంది. కానీ, షార్ట్ ఆడియో క్లిప్ రికార్డ్ చేసి వదలగానే అది వెళ్లిపోతుంది. దాన్ని పరిశీలించే అవకాశం ఉండదు. దీనివల్ల రాంగ్‌ సందేశాలు పంపే అవకాశాలు ఉన్నాయని వచ్చిన ఫిర్యాదుల‌పై స్పందించిన వాట్స్ యాప్ రికార్డింగ్ చెక్ చేసుకుని, సరిచేసుకునే అవకాశం కల్పిస్తున్నట్టు వెల్ల‌డించింది.


ఆడియో రికార్డును మరోసారి చెక్ చేసుకున్న తరువాతే, మ‌రో వ్యక్తికి చేరేలా అప్ డేట్ సిద్ధం చేశామని, ప్రస్తుతం ఈ ఫీచర్ ఐఓఎస్ లో బీటా దశలో ఉందని, అతి త్వరలో అందరు యూజర్లకూ అందుబాటులోకి వస్తుందని సంస్థ ప్ర‌క‌టించింది. ఇప్ప‌టికే ఎన్నో ఫీచ‌ర్ల‌ను అంద‌జేసిన వాట్స‌ప్ మ‌రో కొత్త ఫీచ‌ర్‌తో రాబోతుంది. ఈ ఫీచ‌ర్‌తో ఇక‌పై రాంగ్ సందేశాల‌కు ఇత‌రుల‌కు వెళ్ల‌కుండా బ్రేక్ ప‌డుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: