స్మార్ట్‌ఫోన్ వినియోగిస్తోన్న ప్రతి ఒక్కరికి ‘వాట్స్ యాప్' సుపరిచితమైన అప్లికేషన్. ఈ చాటింగ్ యాప్ ద్వారా సమచారాన్నిఫోటో ఇంకా వీడియోల రూపంలో షేర్ చేసుకోవచ్చు. హ్యాకింగ్ ప్రపంచం ఇంటర్నట్ ప్రపంచాన్ని పట్టి పీడిస్తోన్న నేపథ్యంలో వాట్స్ యాప్ వినియోగంలోనూ జాగ్రత్తలు తప్పనిసరి అంటున్నారు నిపుణులు.


ఫోటోలు, వీడియోలు రూపంలో వాట్స్ యాప్‌లో మనం షేర్‌ చేస్తున్న డేటాను ఇతరులు కూడా యాక్సెస్ చసుకునేందుకు వీలువతుందుని ఇటీవల ఓ సెక్యూరిటీ సంస్థ వెల్లడించిన విషయం తెలిసిందే. వాట్స్ యాప్ ద్వారా మెసేజ్‌లను షేర్‌ చేసే సమయంలో ఉపయోగించే ఎన్‌క్రిప్షన్ కోడ్స్‌ను డీకోడ్ చేసే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు.


మీ స్మార్ట్‌ఫోన్‌‍లోని వాట్స్ యాప్ సందేశాలను లాక్ చేయటం ద్వారా మీ వాట్స్ యాప్ అకౌంట్ సెక్యూరిటీ స్థాయిని మరింత పటిష్టం చేయవచ్చు. ఇందుకుగాను గూగుల్‌ప్లే స్టోర్‌లో వాట్స్ యాప్ లాక్ పేరుతో ఓ ఉచిత యాప్ లభ్యమవుతోంది. ఈ యాప్‌ను ఇన్స్‌స్టాల్ చేసుకున్నట్లయితే మీ స్మార్ట్‌ఫోన్‌లోని వాట్స్‌యాప్ సందేశాలను లాక్ చేసుకోవచ్చు.


స్మార్ట్‌ఫోన్ యాప్‌ను రీఇన్‌స్టాల్ చేసిన సమయంలో కొన్నిసార్లు పాత సంభాషణలు మిస్ అవుతుంటాయి. ఈ సమస్యను అధిగమించేందుకు ఆండ్రాయిడ్ యూజర్లు తమ స్మార్ట్‌ఫోన్‌లోని వాట్స్‌యాప్ సెట్టింగ్స్‌లోకి ప్రవేశించి చాట్ సెట్టింగ్స్‌ను సెలక్ట్ చేసుకుని చాట్ సంభాషణ ఆప్షన్‌ను ఎంపిక చేసుకున్నట్లయితే పాత సంభాషణలను తిరిగి పొందవచ్చు. అలాగే హ్యాకర్ల నుంచి వాట్స్‌యాప్ అకౌంట్‌ను రక్షించుకునేందుకు మీ వై-ఫైకు పటిష్టమైన పాస్‌వర్డ్‌ను జత చేయండి.



మరింత సమాచారం తెలుసుకోండి: