ఈరోజుల్లో స్మార్ట్ ఫోన్ లేని వారు ఎవరు ఉండరు.. ఇక స్మార్ట్ ఫోన్ ఉన్నవారు వాట్సాప్ వాడకుండా ఉండరు. వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లతో తనను తాను అప్‌డేట్ చేసుకుంటూ.. యూజర్లకు నాణ్యమైన సర్వీసులు అందిస్తున్న విషయం తెలిసిందే. రోజుకో అప్‌డేట్‌తో స‌రికొత్త పుంత‌లు తొక్కుతోంది. ఈ క్ర‌మంలోనే వాట్సాప్ వినియోగదారులకి వాట్సాప్ ఒక కొత్త ఫీచర్ ముందుకు తీసుకొనిరానుంది. అది ఏంటంటే..


త్వరలోనే వాట్సాప్ డెస్క్‌టాప్ వెర్షన్‌ను తీసుకురాబోతున్నట్టు సమాచారం. అది  అందుబాటులోకి వస్తే ఫోన్‌తో డెస్క్‌టాప్‌, పీసీలను అనుసంధానం చేసుకునే బాధ తప్పుతుంది. డెస్క్‌టాప్‌పై వాట్సాప్ పనిచేయాలంటే తప్పనిసరిగా మొబైల్, దానికి ఇంటర్నెట్ ఉండాల్సిందే. అయితే మ‌న ఫోన్ ఆఫ్‌లో ఉన్నా ఈ ఫీచ‌ర్ ద్వారా ప‌ని చేసుకోవ‌చ్చు అని తెలుస్తోంది. అలాగే ఒకే అకౌంట్‌పై పలు డివైజ్‌లలో ఒకేసారి పనిచేసుకునేలా వాట్సాప్ దీనిని త‌యారు చేస్తున్న‌ట్టు స‌మాచారం.


ఇక‌ నేరుగా డెస్క్‌టాప్‌పైనే పనిచేసేలా ‘యూనివర్సల్ విండోస్ ప్లాట్‌ఫాం’ యాప్‌ను సిద్ధం చేస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. నిజానికి ఈ యాప్ ద్వారా చాలా ప్ర‌యోజ‌నాలు ఉన్నాయి. ఫోన్‌కి నెట్ లేని స‌మ‌యంలో ఇది బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది.  అయితే వాట్సాప్ డెస్క్‌టాప్ వెర్షన్‌ను అతి త్వ‌ర‌లోనే తీసుకురాబోతున్న‌ట్టు తెలుస్తోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: