నాసా నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ అమెరికాలోని వాషింగ్టన్ లో ఈ సంస్థను 1958 జులై 29న స్థాపించారు. అంతరిక్ష ప్రాజెక్ట్ లు మాత్రమే కాకుండా ఎన్నో కొత్త కొత్త ప్రయోగాలు చేయడంలో నాసాకు తిరుగులేదు. తాజాగా నాసా మరో హాట్ ప్రాజెక్ట్ మొదలుపెట్టబోతుంది. అంతరిక్షంలో ఇప్పటి వరకు ఎన్నో ప్రయోగాలు జరిగాయి. ఇంకా జరుగుతూనే ఉన్నాయి. అయితే అంతరిక్షంలో మొక్కలు పెంచడం కష్టమైన పని అది దాదాపు అసాధ్యమనే చెప్పాలి. అలాంటిది నాసా మాత్రం ఇప్పటికే క్యాబేజి, ముల్లంగి లాంటి మొక్కల్ని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో సాగు చేసింది. అవి విజయవంతం అయినవి కూడా. అయితే ఈ ఆలోచన ఇప్పటిది కాదు.


34 ఏళ్ల క్రితం సోవియట్ రష్యాలో శాల్యూట్ 7 అంతరిక్షనౌక వ్యోమగాములు 1982 లో మొదటిసారి ఆవు జాతికి చెందిన ఆరాబిడోప్సిస్ మొక్కను అంతరిక్షంలో పెంచారు. అది కొంతవరకే సక్సెస్ అయి ఆ తర్వాత క్యాబేజి, ముల్లంగి వంటి మొక్కల్ని పెంచాలి. అవి మాత్రం కొంత ప్రయోజనం కలిగించాయి. ప్రస్తుతం నాసా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో తన తర్వాత పంటగా యస్పానాలకు చెందిన చిల్లీ పెప్పర్ ను పండించేందుకు సన్నాహాలు చేస్తుంది. యస్పానాకు చెందిన మిరప మొక్కల్ని పండించబోతుంది. మాములుగా పచ్చిమిర్చీ అనేది కాయజాతికి చెందింది. ఇది మాత్రం పండ్ల జాతికి చెందింది. అందువల్ల ఇది మిరపకాయ్ పంటకాదు, అంతరిక్షంలో పండే పండ్లుగ ఇది రికార్డులోకెక్కనుంది.


ప్రపంచంలో ఎన్నో రకాల పండ్లు ఉండగా నాసా ఈ మిరప పండ్లనే ఎందుకు పండించాలనుకుంది అన్న సందేహం కలగొచ్చు. అంతరిక్షంలో కార్బన్ డయాక్సైడ్ ఎక్కువ. అలాంటి చోట మామూలు మొక్కలు పెరుగలేవు. ఈ మిరపమొక్క మాత్రం కార్బన్ డైయాక్సైడ్ ఎంత ఉన్నా తట్టుకోగలదు. అందువల్ల వీటిని పండించేందుకు నాసా సిద్ధమవుతుంది.ఇందుకోసం ఈ విత్తనాలను 2019 నవంబర్ నుంచి 2020 జనవరి మద్య పంపనున్నారు. అంతరిక్ష కేంద్రంలో ఈ మిరప పంట ఇలా పండితే మాస్ చందమామ పైన వీటిని పండించేందుకు వీలవుతుందని నాసా భావిస్తుంది.


అంతరిక్ష కేంద్రాలలో నెలల తరబడి ఉండే వ్యోమగాములు కూడా ఇవి ఆహారంగా ఉపయోగపడతాయని శాస్త్రవేత్తలంటున్నారు. సాధారణంగా వ్యోమగాములు తినేందుకు ఇక్కడ్నుంచి ప్యాక్ చేసిన ఆహారాన్ని పంపిస్తారు. అయితే వీటిల్లో సరైన పోషకాలు ఉండడం లేదని వారికి మరిన్ని పోషకాలు అందేలా చేసేందుకు అక్కడే పంటలు పండించటం మంచిదని అభిప్రాయపడ్డారు.


మరింత సమాచారం తెలుసుకోండి: