చాలా మంది దంపతులకు పెళ్లి అయ్యి ఏళ్లు గడుస్తున్నా పిల్లలు ఉండరు. పిల్లల కోసం ఆ దంపతులు ఎంతో ఆరాట పడుతూ ఉంటారు. ఆ దంపతులు వెళ్లని డాక్టర్లు ఉండరు... చేయించుకొని వైద్యం ఉండదు. ఎన్నో మందులు వాడుతుంటారు. అయినా పిల్లలు పుట్ట‌రు... పిల్లలు పుట్టక పోవడానికి ప్రధాన కారణం పురుషుల్లో వీర్యకణాల సంఖ్య తక్కువగా ఉండటం. ఇందుకు చాలా కార‌ణాలు ఉంటాయి. 


అయితే అధికమైన పని ఒత్తిడి... కంప్యూటర్ ఉద్యోగుల వల్ల శృంగార సామర్థ్యం తగ్గి వీర్యకణాల సంఖ్య కూడా తగ్గుతుందని ఇటీవల పరిశోధనలు చెబుతున్నాయి. తాజాగా అమెరికాలోని చికాగో ఇల్లినాయిస్ యూనివర్సిటీ పరిశోధకులు ఇంట్లోనే శృంగార సామర్థ్య పరీక్ష స్మార్ట్ ఫోన్ తో చేసుకునేలా తయారు చేశారు. ‘ఐ ఫోన్ మైక్రో స్కోప్’గా నామకరణం చేశారు. 


స్మార్ట్ ఫోన్లను మైక్రో స్కోప్ లుగా మార్చే ప్రత్యేక లెన్స్ లను రూపొందించారు. ఈ లెన్స్‌ల ద్వారా వీర్య‌క‌ణాలు తెలుసుకోవ‌చ్చు. ఈ ప‌రిశోధ‌కులు త‌యారు చేసిన లెన్స్ లను స్మార్ట్ ఫోన్ కు అనుసంధానించి కెమెరాకు కలుపుతారు. వీడియో ద్వారా వీర్యకణాల సంఖ్యను పరీక్షిస్తారు. స్మార్ట్ పోన్ కు ఆప్టికల్ కేబుల్ అనుసంధానిస్తారు. ఈ ప‌రీక్ష‌ల్లో అనలైజర్ వీర్యాన్నిక్షుణ్ణంగా పరిశీలించి వీర్య కణాల నాణ్యతను తేలుస్తుంది. 


ఈ ఐ ఫోన్ మైక్రోస్కోప్  వీర్యనమూనాని పరీక్షించి ఆప్టికల్ కేబుల్ ద్వారా స్మార్ ఫోన్ కు సమాచారం చేరవేస్తుందని తేల్చారు. కేవ‌లం నిమిషాల వ్య‌వ‌ధిలోనే స్మార్ట్ ఫోన్ ద్వారా మ‌న వీర్య‌క‌ణాల శాతం ఎంతో తెలిసిపోతుంది. ప్రత్యేకంగా తయారు చేసిన యాప్ తో 98శాతం ఫలితాలు ఖచ్చితత్వంగా వస్తాయట.. ఇప్పుడు వీర్యకణాల సంఖ్యను తేల్చే యాప్ వినియోగదారులకు వరంగా మారనుంది. ఇక‌పై ఎవ‌రైనా వీర్య‌క‌ణాల టెస్ట్ చేయించుకోవాలంటే ఈ ప‌ద్ధ‌తి ఫాలో అయితే స‌రిపోతుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: