ప్ర‌స్తుత కాలంలో అన్నిటికి స్మార్ట్ ఫోన్ ఆధారంగా క‌నిపిస్తుంది. ప్ర‌తి ఒక్క‌రు దీన్ని విప‌రీతంగా వాడుతున్నారు.  స్మార్ట్ లేకుండా బ‌య‌ట అడుగు కూడా పెట్ట‌రు. పెద్ద‌లు, పిల్ల‌లు అని తేడాలేకుండా ప్ర‌తి ఒక్క‌రూ స్మార్ట్ ఫోన్ వ‌డుతున్నారు. స్మార్ట్ ఫోన్ రేడియేష‌న్ వ‌ల్ల మ‌నిషికి ఎంత ప్ర‌మాద‌క‌ర‌మైంద‌ని తెలిసినా ఎవ‌రూ దీన్ని ఉప‌యోగించ‌డం మాన‌రు. ఎందుకంటే అదే జీవితంగా మారింది. 


అయితే కొన్ని ప్ర‌దేశాల్లో ఈ స్మార్ట్ ఫోన్ పెట్ట‌డం వ‌ల్ల ఎన్నో అన‌ర్థాలు జ‌రుగుతాయి. చాలా మంది పాడుకునే ముందు ఫోన్‌ను దిండి కింద పెట్టుకుని ప‌డుకుంటారు. దీని వ‌ల్ల ఎఫెక్ట్ అని తెలిసినా ఎవ‌రూ ప‌ట్టించుకోరు. నిజానికి మ‌రి కొన్ని చోట్ల కూడా ఫోన్ పెడితే ఎంతో ప్ర‌మాద‌క‌ర‌మ‌ని నిపుణులు చెబుతున్నారు. మ‌రి ఆ ప్ర‌దేశాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..


- ఏసీలు, రిఫ్రిజ‌రేట‌ర్లు ఉన్న ద‌గ్గ‌ర ఫోన్లు పెట్ట‌కూడ‌దు. ఇలా పెట్ట‌డం వ‌ల్ల 0 డిగ్రీస్ కంటే త‌క్కువ‌గా ఉన్న టెంప‌రేచ‌ర్‌లో ఫోన్ పెట్ట‌డం వ‌ల్ల ఫోన్ బ్యాట‌రీ లైఫ్ త‌గ్గిపోతుంది.


- ప‌డుకునే ముందు ఫోన్‌ను దిండి కింద పెట్టి ప‌డుకోవ‌డం వ‌ల్ల దానిలో ఉంటే రేడియేష‌న్ మ‌న‌కు హీని క‌లుగ‌చేసి ఎన్నో అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు దారి తీస్తుంది.


- స్మార్ట్ ఫోన్‌ను ఎప్పుడూ కూడా ఎండ‌లో పెట్టాకూడ‌దు. ఇలా చేయ‌డంలో వ‌ల్ల ఫోన్‌లో ఉండే ద్ర‌వాలు బ‌య‌ట‌కు వ‌చ్చి ఫోన్ ప‌గిలిపోయే అవ‌కాశం ఉంటుంది.


- రాత్రి స‌మ‌యంలో ఫోన్ వాడ‌డం వ‌ల్ల అందులో క‌నిపించే బ్యూ లైట్ వ‌ల్ల కంటి స‌మ‌స్య‌లు ఏర్ప‌డ‌తాయి. ఒక్కో సారి కంటి చూపు కూడా కోల్పోవాల్సి వ‌స్తుంది.


- మ‌రియు ఫోన్ల‌ను ఎట్టి ప‌రిస్థితిలోనూ వంట‌గ‌దిలో ఉంచ‌కూడ‌దు. ప్రెజర్‌ కుక్కర్‌, స్టవ్‌కి దగ్గరలో ఫోన్‌ని ఉంచితే చాలా ప్ర‌మాద‌క‌రం.


- చాలా మందికి ఫోన్‌ను బ్యాక్ పాకెట్‌లో పెట్టుకునే అల‌వాటు ఉంటుంది. కానీ అలా చేయ‌డం వ‌ల్ల మ‌నం ఎక్క‌డైనా కూర్చుంటే ఫోన్ మీద ప్రెజ‌ర్ ప‌డి.. ఫోన్ పాడైపోయే అవ‌కాశాలు ఉంటాయి.


- మొబైల్‌ను ఎప్పుడూ కూడా ఛార్టింగ్‌లో పెట్టి వాడ‌కూడ‌దు. ఇలా చేయ‌డం వ‌ల్ల ఫోన్ మ‌ద‌ర్ బోర్డ్ మ‌రియు ప్రాసెస‌ర్ మీద తీవ్ర ఒత్తిడి పెరిగి ఫోన్ ప‌గిలిపోయే ఛాన్స్ ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: