డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్(డీఆర్డీఓ) ఒడిశా లో నిర్వహించిన మిస్సైల్ నింగిలోకి దూసుకుపోయింది. 25కి.మీ నుంచి 30కి.మీల రేంజ్‌లో ఈ ప్రయోగం నిర్వహించారు. ఛండీపూర్‌లో ఈ ప్రక్రియను నిర్వహించారు. దేశ భద్రతలో భాగంగా భారత్ మరో అడుగు ముందుకేసింది. మిసైల్ ఫలిచింది. ఉపరితలంలోకి ఈ (క్విక్ రియాక్షన్ సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్)లో భాగంగా చేసిన ప్రయోగం విజయవంతంగా ముగిసింది. 

రక్షణ విభాగంలోకి సరికొత్త ఆయుధం చేరడంతో త్రివిధ దళాలకు మరింత బలం చేకూరినట్లు అయింది. ముఖ్యంగా కశ్మీర్‌లోని అమర్‌నాథ్ యాత్ర నుంచి ప్రయాణికులను రిటర్న్ అవ్వాలని ఇంటలిజెన్స్ విభాగం సూచించిన సంగతి తెలిసిందే. ఇటువంటి పరిస్థితుల్లో సైనికులకు ఈ మిస్సైల్ దన్నుగా నిలుస్తుందనడంలో సందేహం లేదు. ప్రదానంగా ఈ మిస్సైల్ సాయంతో గాలిలో కదులుతున్న వస్తువులను, ట్యాంకర్లను, బంకర్లను ధ్వంసం చేయొచ్చు. దీనికి ఇంధనంగా ఘన పదార్థం వాడటంతో ఎటువంటి వాతావరణంలోనైనా ప్రయోగించవచ్చు. 


ఎయిర్‌క్రాఫ్ట్ రాడర్ల సాయంతో తీసుకెళ్లి గగనతలానికి వెళ్లిన తర్వాత ఫైరింగ్ చేశారు. ఈ ప్రయోగాన్ని గతంలోనే అంటే 2017 జులై 4న తొలిసారి నిర్వహించారు. ఈ సంవత్సరం ఫిబ్రవరిలోనూ భారత్ క్యూఆర్ఎస్ఏఎమ్‌ను ఒడిశా తీరంలో ప్రయోగించింది. రోబస్ట్ కంట్రోల్, ఏరో డైనమిక్స్, మానోవ్రింగ్ పలు రకాలుగా సక్సెస్‌గా నిలిచింది.


మరింత సమాచారం తెలుసుకోండి: