ప్ర‌స్తుత స‌మాజం జీవ‌న‌శైలిలో ఏవి లేకుండా బ్ర‌త‌క‌గ‌లంగానీ ఇంట‌ర్నెట్ లేకుండా బ్ర‌త‌క‌లేము అన్న‌ట్టుగా మారిపోయింది. ఇప్ప‌టికే ప్ర‌పంచ వ్యాప్తంగా 2జీలు, 3జీలు బాగా విస్త‌ర‌ణ జ‌రిగాయి. అయితే 3జీనే గొప్ప అనుకుంటే దీనిని మించి 4జీ ప్ర‌స్తుతం దూసుకుపోతుంది. జియో, రిలయెన్స్ మొత్తం దేశాన్ని 4జీ మ‌యం చేసేసింది. అయితే ప్ర‌స్తుత టాక్ మొత్తం 5జీపై ప‌డింది. తాజాగా 5జీ ప్రవేశంతో టెక్నాలజీ ప‌రంగా అభివృద్ధి చేందుతుంద‌ని అమెరికన్‌ సైబర్‌ నిపుణుడు హెరాల్డ్‌ ఫర్ష్‌టాగ్‌ అన్నారు. 


అయితే 5జీ వస్తే.. కేవలం నెట్ స్పీడ్ మాత్రమే పెరుగుతుంది అనుకుంటే పొరపాటు. ఎందుకంటే ఈ హైస్పీడ్ కనెక్టివిటీ దేశ స్వరూపాన్నే మార్చోబోతంది. అలాగే సైబర్‌ భద్రత అంశాలపై రకరకాల పరిశోధనలు చేసిన హెరాల్డ్ వీటిపై పుస్త‌కాలు కూడా రాశారు. ఇక తాజాగా నిర్వ‌హించిన స‌ద‌స్సులో అమెరికన్‌ కాన్సులేట్ 5జీ గురించి కొన్ని ఆస‌క్తిక‌ర అంశాల‌ను వెల్ల‌డించారు. 5జీ రాక‌తో టెక్నాల‌జీ రంగంలో విప్ల‌వాత్మ‌క మార్పులు వ‌స్తాయి. అలాగే 5జీని చైనాలో స‌క్సెస్ అయింది. దీంతోపాటు ఇతర దేశాలకు కూడా ఆ సాంకేతికతను ఎగుమతి చేస్తోందన్నారు. కానీ 5జీ టెక్నాల‌జీకి ఎంత ఉప‌యోగం ఉందో అంతే దుష్ప్రభావాలు ఉన్నాయ‌ని చెప్పారు. మ‌రి ఆ ప్ల‌స్‌లు, మైన‌స్‌లు ఏంటో చూద్దాం..


ప్ల‌స్‌లు(+):
-  నిజానికి గతంలో ఊహించనంత స్పీడ్, అత్యాధునిక అప్లికేషన్లు, డేటా ట్రాన్స్‌ఫర్, వైర్‌లెస్‌ టెక్నాలజీతో కమ్యూనికేషన్ల రంగంలో 5జీ టెక్నాల‌జీ రాబోతుంది.


- దీని వల్ల ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కు ఎక్కువ ప్రయార్టీ ఉంటుంది.


- వాతావరణం,  జంతువుల కదలికలు, వర్షపాతం, ఉష్ణోగ్రత నదుల సమాచారం, పంటలకు చీడలు వంటి వివ‌రాలు 5జీ తో ఇంత‌కు ముందుకంటే వేగంగా స‌మాచారం తెలుస్తుంది.


- 5జీ వ‌ల్ల‌ వ్యాపార, వ్యవసాయ, వైద్య రంగాల్లో కొత్త మార్పులు వ‌స్తాయి.


మైన‌స్‌లు(-): 
- మన జీవితం ఇంటర్నెట్‌తో కనెక్ట్ అవుతుంది కాబట్టి సెక్యూరిటీ విషయంలో మరింత జాగ్రత్త అవసరం. వైరస్, డేటా థెప్ట్, హ్యాకింగ్ బారిన ప‌డే అవ‌కాశం ఎక్కువ‌గా ఉంటుంది.


- కమ్యూనికేషన్, రక్షణ, రవాణా రంగాలకు సంబంధించిన వ్యవస్థలను హ్యాక్‌ చేసే ప్ర‌మ‌దాలు కూడా ఉంటాయి.


- అలాగే విద్రోహ, ఉగ్ర చర్యలకూ ఆస్కారం ఉంటుంది. మ‌రియు దేశ భద్రత విషయంలో మరింత అప్రమత్తత అవసరం.



మరింత సమాచారం తెలుసుకోండి: