ప్ర‌స్తుత స‌మాజంలో స్మార్ట్ ఫోన్ వాడ‌కం ఎక్కువ ఉంది. ఉద‌యం లేచిన‌ప్ప‌టి నుంచి రాత్రి ప‌డుకునే ముందు వ‌ర‌కు స్మార్ట్ ఫోన్ వాడుతూనే ఉంటారు. మ‌రియు ప్ర‌పంచంలోనే టాప్ మెసెంజ‌ర్ అయిన‌ వాట్స‌ప్‌ను ప్ర‌తి ఒక్క‌రూ యూజ్ చేస్తారు. అలాగే వాట్స‌ప్ కూడా ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త ఫీచ‌ర్ల‌ను యూజ‌ర్ల‌కు అందిస్తూనే ఉంది. ఎన్ని యాప్స్ వ‌చ్చినా దీన్ని ఢీ కొట్ట‌లేక‌పోతున్నాయి. వాట్ప‌ప్ త‌న కొత్త కొత్త ఫీచ‌ర్ల‌తో యూజ‌ర్ల‌ను ఆక‌ట్టుకుంటుంది. ఈ క్ర‌మంలోనే వాట్ప‌ప్‌లో మిమ్మ‌ల్ని ఎవ‌రైనా బ్లాక్ చేస్తే ఎంతో సులువుగా మీరు వాళ్ల‌తో తిరిగి చాట్ చేయ‌వ‌చ్చు.


నిజానికి వాట్స‌ప్ లో మిమ్మ‌ల్ని బ్లాక్ చేసిన వ్య‌క్తుల‌ను కాంటాక్ట్ లిస్ట్‌లో చూడ‌లేరు. మ‌రి వాళ్ల‌తో తిరిగి చాట్ చేయ‌డం ఎలాగో తెలుసుకోవాలంటే ఓ లుక్కేయండి... ముందుగా మీ ఇద్దరి మ్యూచువల్ ఫ్రెండ్ తో ఒక వాట్సాప్ గ్రూప్‌ను క్రియేట్ చేయండి. మిమ్మల్ని బ్లాక్ చేసిన వ్యక్తితో మీరు కొత్త గ్రూప్ క్రియేట్ చేయండి. వేరే నెంబర్ ఉంటే ఆ నెంబర్ ను మీ మ్యూచువల్ ఫ్రెండ్ ను గ్రూప్ క్రియేట్ చేయమని చెప్పండి.


మీ వాట్సాప్‌ను ఓపెన్ చేసి మీరు ఇతర నంబర్‌ను వాడుతుంటే అప్పుడు ఆ గ్రూప్‌న‌కు మూడవ వ్యక్తిని యాడ్ చేయండి. గ్రూప్ క్రియేట్ అయిన తర్వాత.. గ్రూప్ లో ఉన్న మూడు డాట్స్ ను ఓపెన్ చేసి `గ్రూప్ ఇన్ఫో`ను అనే ఆప్షన్ ను క్లిక్ చేయండి. ఇప్పుడు మూడో అకౌంట్‌ను అడ్మిన్ గా అసైన్ చేయండి. అకౌంట్ 1 గ్రూప్ లో యాడ్ చేయమని అకౌంట్ 3 కు చెప్పండి. ఎంతో ఈజీగా మిమ్మ‌ల్ని బ్లాక్ చేసిన వ్య‌క్తితో చాట్ చేయండి.



మరింత సమాచారం తెలుసుకోండి: