ఇటీవ‌ల కాలంలో స్మార్ట్ ఫోన్ వాడ‌కం ఎక్కువ‌గా ఉంది. మ‌రియు వాట్స‌ప్ వాడ‌కం కూడా అదే స్టాయిలో ఉంది. ఎక్కువ శాతం మంచి వాట్స‌ప్ వాడుతున్నారు. నిజానికి మెసెజ్‌లు ఎక్కడి నుంచి ఎక్కడికైనా పంపుకునే సౌలభ్యం ఉండడంతో పాటు ఎటువంటి ఛార్జీలు లేకపోవడంతో అందరూ అధికంగా వాడుతున్నారు. రోజుకు వాట్స్‌ప్‌ల నుంచి కోట్లలో మేసేజ్‌లు, ఫొటోలు వెళ్తున్నట్లు సర్వేలలో వెల్లడవుతోంది. అయితే వాట్స‌ప్ వాడే వారంద‌కి ఓ గుడ్ న్యూస్‌.


అదేంటంటే వాట్స‌ప్‌లో బ్యాంక్ ఖాతా ఓపెన్ చేసే అవ‌కాశం ప్ర‌స్తుతం అందుబాటులోకి వ‌చ్చింది. మ‌రి దీనికి అన్ని బ్యాంకులు అయితే సేవ‌లు అందించ‌డం లేదుగానీ కేవ‌లం ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌లు మాత్ర‌మే సేవ‌లు అందిస్తుంది. అలాగే దీన్ని కేవ‌లం ఐదు నిమిషాల్లోనే అకూంట్ ఓపెన్ చేయొచ్చు. 


నిజానికి వాట్సప్ నెలకు దాదాపు 70 కోట్లమంది వినియోగదారులతో ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన ప్రాచుర్యం పొందిన టెక్ట్స్‌, ఆడియో, విడియో, ఇమేజ్ మెసేజింగ్ యాప్. ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త ఫీచ‌ర్లును అందించే వాట్స‌ప్ ఇప్పుడు బ్యాంకింగ్ సేవ‌ల‌ను సులభ‌త‌రం చేస్తోంది. ఈ క్ర‌మంలోనే వాట్స‌ప్ ద్వారా బ్యాంక్ ఖాతా తెరిచేందుకు సేవ‌లు అందిస్తున్నామ‌ని ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఎండీ, సీఈవో సంజయ్ అగర్వాల్ వెల్ల‌డించారు. 


వాట్స‌ప్‌లో బ్యాంకింగ్ సేవ‌లు లాంచ్ చేయ‌డం అంత సులువైమి కాద‌ని.. దీని వెన‌క ఎన్నో అంశాలు ఉంటాయ‌ని పేర్కొన్నారు. అలాగే వాట్సాప్ బ్యాంకింగ్ సేవల కోసం ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌తో క‌ల‌వ‌డం చాలా హ్యాపీగా ఉంద‌ని క్యారిక్స్ మొబైల్ సీవోవో దీపక్ గోయెల్ తెలిపారు. ఇక వాట్స‌ప్ త‌న బ్యాంకింగ్ సేవ‌ల‌తో పాటు ఇత‌ర స‌ర్వీసులు అందించ‌బోతుంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: