నెట్ ప్రపంచంలో సంచలనాలు సృష్టించడంలో జియోకి పోటీగా మరే నెట్వర్క్ దరిదాపుల్లోకి వచ్చే అవకాశాలు కనపడటంలేదు. జియో ఆఫర్లతో పోటీ పడటానికి సైతం ఇతర పోటీ దారులు వెనకడుగు వేస్తున్న పరిస్థితి ఉంది. అయితే తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకున్న జియో ఇప్పుడు మరో సంచనలనానికి తెరలేపింది. ఇంట్లో ఉండే కొత్తసినిమా ఫస్ట్ షో చూడగలగడం, ఇంట్లో ఉండే వర్చ్యువల్ రియాలిటీ పద్దతి ద్వారా  బట్టలని ఎన్నుకుని ఆన్లైన్ లో షాపింగ్ చేయడం. ఇలాంటి ఎన్నో అదునాతమైన పరిజ్ఞానాన్ని ఇప్పుడు వినియోగ దారుడికి అత్యంత చేరువ చేయనుంది. అందుకుగాను

 Image result for jio 4k set top box free

దేశవ్యాప్తంగా జియో ఫైబర్ సేవలని సెప్టెంబర్ 5 నుంచీ అందుబాటులోకి తీసుకురానుంది. ఈ సేవలలో టారిఫ్ ప్లాన్ 700 మొదలు 10000 వేల వరకూ ఉంటుందని ముఖేష్ అంబాని ప్రకటించారు. ఒకే ఒక్క కనక్షన్ తో జియో నెట్, డీటీహెచ్,ల్యాండ్ లైన్ సేవలని పొందవచ్చని తెలిపారు. ఫ్రీ వాయిస్ కాల్స్ తో పాటుగా ఇంటర్నేషనల్ కాల్స్ కూడా అతి తక్కువ ఖర్చుతోనే పొందవచ్చని ముకేష్ తెలిపారు.

 Image result for virtual clothes shopping

ఈ సేవలు అన్నిటినీ కేవలం జియో 4k సెట్ అప్ బాక్స్ ద్వారా పొందవచ్చని ప్రకటించారు. అంతేకాదు 4k అల్ట్రా ద్వారా అత్యంత నాణ్యమైన టీవీ ప్రసారాలని పొందవచ్చని జియో ప్రకటించింది.ఇక మరొక బంపర్ ఆఫర్ ఏమిటంటే. గిగాఫైబార్ సంవత్సర ప్లాన్ తీసుకున్నవారికి HD 4k LED టీవీతో పాటు, సెట్అప్ బాక్స్ కూడా ఉచితంగా “ జియో ఫరెవర్ యాన్యుయాల్ ప్లాన్” పేరుతో ఇవ్వబడుతుందని ముఖేష్ అంబాని తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: