కృత్రిమ మేధస్సుతో పనిచేసే కంప్యూటర్ అప్లికేషన్లతో రూపొందించే  వీడియోలు నకిలీవా? నిజమైనవా? అని గుర్తించడం అంత సులువు కాదు.ఈ డీప్ ఫేక్ వీడియోలో మనుషుల ముఖాలను మార్చేస్తారు,లేని మనుషుల్ని ఉన్నట్లు,చేయని పనుల్ని చేసినట్లు చూపిస్తారు.ఒకరి సంభాషణకు మరో వ్యక్తి దృశ్యాలను,ఫొటోలను జతచేస్తారు,ఇన్నాళ్లూ నకిలీ వార్తలు,మార్ఫింగ్ ఫొటోల సమస్య ఎక్కువగా ఉండేది.కొంతకాలంగా ఈ డీప్ ఫేక్‌లు ప్రమాదకరంగా మారుతున్నాయి.ఎక్కువగా సెలెబ్రిటీలే వీటి బారిన పడుతున్నారు.అందుకే ఈ నకిలీ వార్తల కంటే ప్రమాదకరమైన
డీప్ ఫేక్‌లను ఎదుర్కొనేందుకు పరిశోధకులు ఒక కొత్త అస్త్రాన్ని సిద్ధం చేస్తున్నారు.ఆ అస్త్రం ఏంటో కాదు,ఎలుకలు..



అవును మీరు చదివేది నిజమే ఈ డీప్ ఫేక్‌లను గుర్తించి,వాటి వ్యాప్తిని అడ్డుకునేందుకు అత్యంత సమర్థమైన సాంకేతికతను అభివృద్ధి చేయడానికి కొంతకాలంగా తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయట.అందులో భాగంగానే, అమెరికాలోని ఓరెగాన్‌ విశ్వవిద్యాలయానికి చెందిన న్యూరోసైన్స్ ఇన్‌స్టిట్యూట్ చేస్తున్న విచిత్రమైన ప్రయోగాల్లో ఎలుకలకు శిక్షణ ఇవ్వడం ఒకటి..ఎలుకలు డీప్ ఫేక్‌లను గుర్తించగలిగితే,అది వాటికి ఎలా సాధ్యమవుతోందన్న దానిని విశ్లేషించి,దాని ఆధారంగా సాంకేతికతను మెరుగుపరచాలన్నది తమ ఆలోచన అని ఈ పరిశోధనా బృందంలోని జొనాధన్ శాండర్స్ చెప్పారు.



ఇప్పటికే డీప్ ఫేక్‌లను గుర్తించేందుకు వినియోగిస్తున్న సాంకేతిక పద్ధతులను మరింత మెరుగుపరిచేందుకు ఈ పరిశోధన ఎంతో ఉపయోగపడుతుందని అందులో భాగంగా కొన్ని శబ్దాలను అర్థం చేసుకునేలా ఎలుకలకు శిక్షణ ఇచ్చినట్లు శాండర్స్ తెలిపారు..అంతేకాకుండా డీప్ ఫేక్‌లు వ్యాప్తి చెందకుండా కట్టడి చేసేందుకు ఫేస్‌బుక్,యూట్యూబ్ లాంటి సంస్థలకు తమ పరిశోధన ఎంతగానో ఉపయోగపడే అవకాశం ఉంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం అనేక పరిణామాలకు దారితీస్తున్న నకిలీ వార్తలే ఓ పెద్ద సమస్య అనుకుంటుంటే, కొంతకాలంగా డీప్ ఫేక్ వీడియో,ఆడియోలు,చిత్రాలు మరింత ప్రమాదకరంగా మారుతున్నాయి.ఇప్పటికే నకిలీ ఫొటోలతో దేశాల మధ్య విభేదాలు సృష్టించేందుకు,శత్రుదేశాలు ప్రయత్నిస్తున్నాయని అమెరికా రిపబ్లికన్ సెనేటర్ మార్కో రుబియో కొన్ని నెలల క్రితం ఆరోపించారు.



ఇంతేకాకుండా ఎన్నికల సమయంలో ఓటర్లను ప్రభావితం చేసేందుకు ప్రత్యర్థులు డీప్ ఫేక్‌లను అస్త్రాలుగా వాడుకునే ప్రమాదం ఉందని కొందరు అమెరికా రాజకీయ నాయకులు అంటున్నారు.అత్యాధునిక అప్లికేషన్లతో రూపొందించే డీప్ ఫేక్‌లను గుర్తించడం పెను సవాలుగా మారుతోందని కొత్త రకమైన కృత్రిమ మేధస్సుకు డీప్ ఫేక్ ఒక ఉదాహరణ అని,అందుకే
కొన్ని దేశాలు ఈ విషయంలో కొత్త చట్టాలను రూపొందిస్తుండగా చాలా దేశాలు డీప్ ఫేక్ నేరాలను.హింస,బ్లాక్‌మెయిల్,కాపీరైట్ చట్టాల పరిధిలోకి తెస్తున్నాయని సైబర్ సెక్యూరిటీ సంస్థ జీరీఫాక్స్‌కు చెందిన నిపుణుడు మాథ్యూ ప్రైస్ అన్నారు....

మరింత సమాచారం తెలుసుకోండి: