ప్రముఖ సోషల్ మీడియా దిగ్గ‌జం వాట్సాప్‌లో మరో మార్పు చోటుచేసుకుంది. ఇప్ప‌టికే వాట్ప‌ప్ ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త ఫీచ‌ర్ల‌ను అందిస్తూ యూజ‌ర్ల‌ను ఆక‌ట్టుకుంటుంది. అయితే ప్రస్తుతం బీటా యూజర్లకు అందుబాటులోకి వచ్చింది. కొన్నిరోజుల క్రితం వాట్సాప్ యాజమాన్యంలోని ఫేస్‌బుక్ చాట్ యాప్‌తో పాటు ఇన్‌స్టాగ్రామ్‌కి బ్రాండింగ్‌ను మార్చడానికి కదులుతున్నట్లు విన్నాము. రెండు సేవలకు పేర్లు "వాట్సాప్ బై ఫేస్బుక్" మరియు ``ఇన్‌స్టాగ్రామ్ బై ఫేస్‌బుక్‌`` అని కనిపించనుంది.


ప్రస్తుతం బీటా 2.19.228 యూజర్లకు ఇది క‌నిపిస్తుండ‌గా త్వరలో అందరికీ ఇదే పేరుతో కనిపించనుంది.  దీనిని ఇప్పుడు ఫేస్‌బుక్ వాట్సాప్ అని పిలుస్తుంది. అయితే ప్రస్తుతం ఈ మార్పు వాట్సాప్ యొక్క బీటా వెర్షన్‌లో భాగమైనందున, చాలా మంది వినియోగదారులు దీనిని తమ రెగ్యులర్ వాట్సాప్‌కు తదుపరి స‌మీక‌ర‌ణంలో చూడ‌నున్నారు. ఈ మార్పు ప్రస్తుత వాట్సాప్ అనుభవానికి ఎలాంటి ప్రభావం చూపదు. 


ఇది పేరు మార్పు మాత్రమే. భవిష్యత్తులో ఇది పెద్ద మార్పులను, వాట్సాప్ అనుభవంపై ప్రభావం చూపే మార్పులను సూచించినందున ఇది కూడా ముఖ్యమైనది. ఫేస్‌బుక్ తన చాట్ సేవలను - వాట్సాప్, ఫేస్‌బుక్ మెసెంజర్ మరియు ఇన్‌స్టాగ్రామ్ మెసేజింగ్ - అన్నింటినీ ఒక సాధారణ చాట్ ప్లాట్‌ఫామ్‌లో యూజ‌ర్ల‌కు అనుసంధానంగా ఉండాల‌ని అనుకుంటుంది. ఇక ఈ మ‌ర్పు వ‌ల్ల‌ మీరు ఫేస్‌బుక్ మెసెంజర్‌ను ఉపయోగిస్తుంటే మరియు వాట్సాప్ మాత్రమే ఉపయోగించే వారితో నేరుగా చాట్ చేసే అవ‌కాశం ఉంటుంది. 


ఇంటిగ్రేషన్ జరిగిన తర్వాత మీరు అలా చేయగలుగుతారు. ఈ కొత్త స‌దుపాయాన్ని ఫేస్‌బుక్ సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ ప్ర‌క‌టించారు. 2020 లో ఇటువంటి ఫీచ‌ర్‌ వాట్సాప్ మరియు ఫేస్‌బుక్ వినియోగదారులకు చేరే అవకాశం ఉందని జుకర్‌బర్గ్ చెప్పారు. తాజాగా యూజర్ల సెక్యూరిటీ కోసం ఫింగర్‌ప్రింట్‌ లాక్‌ సదుపాయం వాట్సాప్‌ తీసుకొచ్చింది.  



మరింత సమాచారం తెలుసుకోండి: