టెలికం దిగ్గజం రిలయన్స్ జియో కొన్ని రోజుల క్రితం ప్రకటించిన  గిగాఫైబర్ ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఎప్పుడెప్పుడు వినియోగదారులకి అందుబాటులోకి ఈ సేవలు వస్తాయో అంటూ ఎదురు చూస్తున్న పరిస్థితి నెలకొంది. ఫస్ట్ డే ఫస్ట్ షో సినిమా ఇంట్లో కాలుమీద కాలు వేసుకుని మరీ చూడచ్చు, వర్చ్యువల్ షాపింగ్ కూడా చేయచ్చు అని ముకేష్ అంబాని ప్రకటించడం దేశ వ్యాప్తంగా ఈ సేవలకోసం ఎదురు చూసేలా చేస్తోంది.

 Image result for jio giga fi

ఈ సేవలు పొందటానికి రూ 700 మొదలు 10 వేల నెలవారీ ప్లాన్లు అందుబాటులోకి రానున్నాయని జియో ప్రకటించింది. ఇక దీని ఇంటర్నెట్ స్పీడు విషయానికి వస్తే 100 ఎంబీపీఎస్ నుంచీ 1జీబీపీఎస్ వరకూ లభ్యం కానుంది. అయితే మరి ముందుగానే ఈ సేవలు పొందాలంటే రిజిస్ట్రేషన్ తప్పనిసరి. ఈ రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఎలాఅంటే..

 Image result for jio giga fi

  • జియో గిగాఫైబర్  రిజిస్ట్రేషన్ వెబ్సైటు : https://gigafiber.jio.com/registration ఓపెన్ చేయాలి.
  • ఈ సేవలని పొందాలనుకునే వారు తమ చిరునామాని ఎంటర్ చేయాలి.
  • అందులోనే ఈ మెయిల్ , ఫోన్ నెంబర్ వివరాలు కూడా నమోదు చేయాలి.
  • ఫోన్ నెంబర్ ఇవ్వగానే ఫోన్ నెంబర్ కి ఒటీపీ వస్తుంది దాన్ని సరి చూసుకోవాలి.
  • చివరిగా మీరు ఎంటర్ చేసిన వివరాలు సరి చూసుకుని జియో ఫైబర్ నెట్ కనెక్షన్ ఇస్తారు.

 


మరింత సమాచారం తెలుసుకోండి: