భారత్ విజయవంతంగా ప్రయోగించిన చంద్రయాన్‌-2 జాబిల్లికి చేరువవుతోంది. ప్రస్తుతం చంద్రుని కక్ష్యలోకి అతి సమీపంలో తిరుగుతున్న వ్యోమనౌక.. ఇంక చందమామ కక్షలోకి ప్రవేశించడమే మిగిలి ఉంది. అక్కడి నుంచి నాలుగు దశల్లో చంద్రునిపై ల్యాండ్ కాబోతుంది స్పేస్ క్రాఫ్ట్.


చంద్రయాన్-2 నుంచి తొలి ఫొటో వచ్చేసింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో తాజాగా ఓ ఫొటోను ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసింది. చంద్రుడి ఉపరితలానికి రెండు వేల ఆరువందల కిలోమీటర్ల ఎత్తునుంచి ల్యాండర్ విక్రమ్ తీసిన ఫొటో ఇదే అని తెలిపింది ఇస్రో. ఈ ఫొటోలో చంద్రుడి దక్షిణంగా ఉన్న అపోలో బిలం, పశ్చిమంలో మేర్ ఓరియంటేల్ అనే మరో బిలాన్ని ఇస్రో చూపెట్టింది. జాబిల్లికి క్రమంగా దగ్గరవుతోంది చంద్రయాన్-2. వ్యోమనౌకలోని మోటార్లను 20 నిమిషాలపాటు మండించిన శాస్త్రవేత్తలు చంద్రుడికి, వ్యోమనౌకకు మధ్య ఉన్న దూరాన్ని నాలుగు వేల నాలుగు వందల పన్నెండు కిలోమీటర్లకు తగ్గించారు. ప్రస్తుతం దీర్ఘవృత్తాకార కక్ష్యలో తిరుగుతున్న వ్యోమనౌక నాలుగో విన్యాసం పూర్తయ్యాక కక్ష్య ఆకారం గుండ్రంగా మారనుంది. ఈ నెల 28 తెల్లవారుజామున శాస్త్రవేత్తలు మరో విన్యాసం చేపడతారు. అనంతరం సెప్టెంబరు 7న చంద్రుడిపై వ్యోమనౌకను ల్యాండ్ చేయనున్నారు మన శాస్త్రవేత్తలు.


ఇస్రో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-2 స్పేస్ క్రాఫ్ట్.. ప్రయోగించినప్పటి నుంచీ ఇప్పటిదాకా భూ కక్ష్యలోనే పరిభ్రమిస్తోన్న విక్రమ్ స్పేస్ క్రాఫ్ట్.. చంద్రుడి కక్ష్యకు అతి సమీపంగా ప్రవేశించింది. ఇస్రో శాస్త్రవేత్తలు దీనికి సంబంధించిన కార్యక్రమాన్ని పూర్తి చేశారు. చంద్రుని కక్ష్యలోకి ప్రవేశించడానికి అవసరమైన ద్రవరూపంలో ఉన్న ఇంధనాన్ని 17 వందల 38 సెకన్ల వరకు మండించడం వల్ల దాని స్పేస్ క్రాఫ్ట్ వేగం పెంచారు. భూకక్ష్యను దాటుకుని చంద్రుని కక్ష్యలోనికి ప్రవేశించడానికి అవసరమైన వేగాన్ని ఇస్రో శాస్త్రవేత్తలు ఈ స్పేస్ క్రాఫ్ట్‌కు కల్పించారు. అయితే మూడు దశల్లో ఈ చంద్రయాన్-2 కొనసాగుతుండగా.. ప్రస్తుతం చివరి దశకు చేరుకుంది. చంద్రుడి కక్షకు అతి సమీపంలో పరిభ్రమిస్తోంది. చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించిన తరువాత కూడా నాలుగు దశలను పూర్తి చేసుకున్న తరువాతే చంద్రయాన్-2 స్పేస్ క్రాఫ్ట్ చంద్రుడిపై దిగగలుగుతుంది. 





మరింత సమాచారం తెలుసుకోండి: