అవ‌కాశం కోసం ప‌డుకోవాలా ? అన్న ప్ర‌శ్న‌తో మ‌హిళ‌ల‌పై జ‌రిగే లైంగీక వేధింపుల‌పై నినందించిన గ‌ళం మీటూ.. సినిమా ఇండ‌స్ట్రీలో మొద‌లైన ఈ ఉద్య‌మం ఇప్పుడు అన్ని రంగాల్లో పెను విప్ల‌వాన్ని క్రియేట్ చేస్తోంది. మ‌హిళ‌లు ధైర్యంగా ముందుకు వ‌చ్చి త‌మ గళం విప్పేందుకు అవకాశం ఇచ్చింది. అదే.. సమయంలో దీన్ని మిస్ యూజ్ చేసిన వైనాన్ని ప్రస్తావించకుండా ఉండలేం. ఏదేమైనా ఈ ఉద్య‌మం మ‌హిళ‌ల్లో చైత‌న్యాన్ని పెంపొందించింది.


మీటూ మాదిరే బ్రిటన్ లో మరో కొత్త తరహా ఉద్యమం మొదలైంది. ఫేస్ బుక్ వేదికగా చేసుకొని స్టార్ట్ అయిన ఈ ఉద్యమం ఇప్పుడు అక్క‌డ పెను ప్ర‌కంప‌న‌లు క్రియేట్ చేస్తోంది. మాజీ భర్తలు తమను ఎంతలా వేధించారో.. మరెంతలా కష్టపెట్టార్న విషయాలతో పాటు.. శారీరకంగానూ.. మానసికంగానూ తమను హింసించిన వైనాల్ని చెప్పుకోవటమే తాజా ఉద్యమం. దీనికి ప్రిక్ అడ్వైజర్ అన్న పేరును పెట్టారు.


ఈ ఉద్య‌మంలో మ‌హిళ‌లు త‌మ‌కు ఇష్టం లేకున్నా లైంగీకంగా వేధించ‌డం.. రేప్ చేయ‌డం... బ‌ల‌వంతంగా గ‌డ‌ప‌డం... త‌మ‌ను మోసం చేసి మ‌రో మ‌హిళ‌తో వివాహేత‌ర సంబంధాలు పెట్టుకోవ‌డం లాంటి విష‌యాల‌పై బాధిత మ‌హిళ‌లు ధైర్యంగా ముందుకు వ‌చ్చి పోస్టులు పెడుతున్నారు. త‌మ పాత భాగ‌స్వామిల వివ‌రాల‌ను ఫొటోల‌తో స‌హా బ‌య‌ట పెడుతుండ‌డంతో ఇప్పుడు మాజీ భ‌ర్త‌ల ప‌రువు పోతుండ‌డంతో వాళ్లు గుండెళ్లో రైళ్లు ప‌రిగెట్టేస్తున్నాయి.


ఈ ఉద్య‌మం వ‌ల్ల త‌మ మాజీ భ‌ర్త‌ల‌ను పెళ్లాడే మ‌హిళ‌ల‌కు వీళ్ల‌కు సంబంధించిన స‌మాచారం ఇలా తెలుస్తోంది. మాజీ భర్తల దుర్మార్గాలు.. దాష్టీకాలతో పాటు.. వారి మనస్తత్వాన్ని తెలిపేలా తాజాగా ఫేస్ బుక్ లో ప్రిక్ అడ్వైజర్ గ్రూప్ ఒకటి స్టార్ట్ అయ్యింది. ఇందులో భర్తతో విడిపోయిన భార్యలు తమ చేదు అనుభవాల్ని వివరిస్తారు. దీంతో ఇప్పుడు త‌మ జీవిత భాగ‌స్వాముల‌కు దూర‌మై కొత్త పెళ్లి కోసం రెడీ అవుతోన్న వాళ్ల‌కు ఇది పెద్ద త‌ల‌నొప్పిగా మారింది.


మరింత సమాచారం తెలుసుకోండి: