ఒకప్పటి మొబైల్ దిగ్గజం..రారాజుగా నిలిచినా నోకియా మళ్ళీ తన సత్తా చాటాలని మార్కెట్ లోకి అడుగుపెట్టింది. ఎలాగైనా సరే మళ్ళీ మార్కెట్ లో నెంబర్ వన్ గా నిలబడాలని భావిస్తున్న నోకియా అందుకు తగ్గట్టుగా తన మొబైల్ అమ్మకాల విషయంలో సంచలన నిర్ణయాలు తీసుకుంటోంది. ఇటీవల కాలంలో మార్కెట్ లోకి రెండు కొత్త వేరియంట్స్ ని విదుల చేసిన నోకియా తాజాగా వాటిపై 2వేల వరకూ తగ్గింపు ఇస్తూ నిర్ణయం తీసుకుంది.

 Image result for nokia6.1

నోకియా 7.1 , 6 .1 ప్లస్ మొబైల్స్ పై ఈ ఆఫర్ ప్రకటించింది. నోకియా 6 .1 ప్లస్ 4 జీబీ ర్యామ్ ధర రూ. 15,999 కాగా సుమారు 4 వేలు తగ్గిస్తూ రూ .11,999 నిర్ణయం తీసుకుంది. ఇదే మోడల్ లో 6 జీబీ ర్యామ్ ధర రూ.    18,499 ఉండగా 14,999 ధరకు తగ్గించి నిర్ణయం తీసుకున్నారు. ఇదిలాఉంటే..

 Image result for nokia 7.1 plus

 

నోకియా 7.1 ప్లస్ 5.84 ఇంచ్ డిస్ప్లే , 4జీబీ ర్యామ్ , 12,5 మెగా పిక్సెల్ డ్యుయల్ కెమెరా, ఫ్రంట్ 8 ఎంపీ సేల్ఫీ కెమెరా, 64 జీబీ నిల్వ సామర్ధ్యం, వంటి ఫీచర్స్ తో సరికొత్త మొబైల్ ని అందిస్తోంది. ఇక బంపర్ ఆఫర్ ప్రకటించిన నోకియా 6.1 ప్లస్ లో 5.8 డిస్ప్లే , 6 జీబీ ర్యామ్, 16,5 బ్యాక్ డ్యుయల్ కెమెరా, ఫ్రంట్ 16 ఎంపీ సేల్ఫీ కెమెరా 64  జీబీ సామర్ధ్యం కలిగి ఉందని సంస్థ తెలిపింది.


మరింత సమాచారం తెలుసుకోండి: