ఇటీవల కాలంలో మొబైల్ యొక్క ఆవశ్యకత, వినియోగం విపరీతంగా పెరిగింది. దానికితోడు మొబైల్ లో ఇంటర్నెట్ వినియోగం కూడా మరింతగా ఎక్కువగా ఉంటుండడంతో, మెల్లగా సాధారణ కీప్యాడ్ ఫోన్లు వాడుతున్న వారు, వాటి స్థానే స్మార్ట్ ఫోన్లు కొనుగోలు చేస్తున్నారు. అయితే స్మార్ట్ ఫోన్ వినియోగం వలన లాభాలు ఎన్ని ఉన్నాయో, నష్టాలు కూడా అంతే ఉంటున్నాయి. ఇప్పటివరకు స్మార్ట్ ఫోన్లను తప్పుడు పద్ధుతుల్లో నియోగిస్తూ పలు సమస్యలకు కారణభూతం అవుతున్న నేరగాళ్లు, నేడు కాల్ స్పూఫింగ్ అనే పద్దతితో మరింతగా అకృత్యాలకు దిగుతున్నారు. ప్రస్తుతం రోజురోజుకు పెను గండంగా మారుతున్న ఈ  కాల్ స్పూఫింగ్ పై మొబైల్ వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు మరియు టెక్ నిపుణులు సూచిస్తున్నారు. మన మొబైల్ కు తెలిసన నెంబర్ నుండి కాల్ వస్తే, మన వాళ్లే కదా అని మనం ఫోన్ తీస్తాం, తీరా ఫోన్ లిఫ్ట్ చేసిన తరువాత, అవతల వేరే ఎవరో కొత్తవారు పలు విధాలుగా తప్పుగా మాట్లాడం, లేదా బెదిరింపులకు గురించేయడం వంటివి జరుగుతున్నాయి. 

ఇక ఇటీవల ఏకంగా ఈ కాల్ స్పూఫింగ్ ని ఉపయోగించి కొందరు ప్రముఖ వ్యక్తుల నంబర్ల తో స్పూఫ్ కాల్ చేసి , గొంతులు మార్చి మాట్లాడి, లక్షల్లో డబ్బులు స్వాహా చేసిన ఘటనలు ఇప్పటికే అందరినీ కలవరపెడుతున్నాయి. అయితే అటువంటి కేసులను పోలీసులు ఛేదించి, నిందితులను శిక్షించిప్పటికీ, చివరికి అసలు నేరస్థులను పట్టుకోవడానికి వారికి ఎంతో కష్టతరం అయింది. నిజానికి ఈ స్పూఫింగ్ కాల్ చేసేవారు, ప్లే స్టోర్ లేదా ఇంటర్నెట్ నుండి ఏదైనా అటువంటి అనధికారిక స్పూఫింగ్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకుని, దానిద్వారా మనకు తెలిసిన వారి ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి వారి ఫోన్ నుండే మనకు కాల్ చేస్తారు. అయితే మనకు ఫోన్ లో మాత్రం మనకు తెలిసినవారి నుంబర్ మాత్రమే డిస్ప్లే అవుతుంది. దీనితో అసలు నేరస్థుల ఒరిజినల్ నెంబర్ పట్టుకోవడం పోలీసులకు చిక్కు సమస్యగా మారుతోంది. ఇక ఇటీవల ఈ తరహా స్పూఫింగ్ కాల్స్ తాలూకు కంప్లైంట్స్ కూడా ఎక్కువగా వస్తుండడంతో, ఇటువంటి వాటిపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అంటున్నారు.  

మన దేశంలో వీటి వినియోగం చట్టవిరుద్ధమైనా, వాటిని నియంత్రించే పరిస్థితి ప్రస్తుతం కనపడడం లేదు. ఈ యాప్‌లు డౌన్‌లోడ్‌ చేసుకునే మోసగాళ్లు, వాటిని ఉపయోగించి చేస్తున్న ఈ వీవోఐపీ (వాయిస్‌ ఓవర్‌ ఇంటర్నెట్‌ ప్రొటోకాల్‌) కాల్స్‌ వలన నేరాలు, మోసాలు మరింతగా పెరిగే అవకాశం ఉందని, కాబట్టి  మనకు తెలిసిన వ్యక్తుల నంబరు నుంచి వచ్చిన కాల్‌ సందేహాస్పదంగా ఉంటే, మరోసారి వారికి ఫోన్‌చేసి కాల్‌ చేసింది వారేనా అనేది ఐడెంటిఫై చేసుకుంటే బెటర్ అని అంటున్నారు నిపుణులు. అయితే ఇది మరింతగా విస్తరించడం వలన నేరానికి పాల్పడినవారు తప్పించుకుని, అమాయకులు బలైపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ తరహా యాప్‌లకు ప్రభుత్వం అడ్డుకట్ట వేయడం, మరియు అటువంటి వాటికి సంబంధించిన సమాచారాన్ని గూగుల్‌ లాంటి సంస్థలకు తెలియజేస్తూ, వాటిని తొలగించేలా చర్యలు ఇప్పటినుండే మనందరం ఒక బాధ్యతగా తీసుకుంటే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.....!!


మరింత సమాచారం తెలుసుకోండి: