చాలా మందికి ఫోటో లు దిగడం ఎంతో ఇష్టం.మరి కొంతమందికి ఫోటోలు తీయడం ఇష్టం. ఎంతో అందమైన ప్రకృతిలో మరింత అందంగా ఫోటోలు దిగాలని అనుకుంటారు. తీర ఫోటోలు చూసుకుంటే ఎక్కడో ఎదో ఒక లోపం కన్పిస్తుంది. ఈ చెట్టు కొమ్మ నాకు అడ్డుగా వచ్చింది. వెనుకాల తన స్నేహితులు వెక్కిరిస్తున్నట్టుగానో, లేదంటే చిత్తు కాగితాలు ఫోటోలో కనిపించడమో ఎదో ఒక లోపం మనకి కనిపిస్తుంది. మరి అలాంటి వాటిని మనం తొలగించుకోవాలి అంటే ఏమి చేస్తాం ఫోటోషాప్ లోకి వెళ్లి దాని టూల్స్ సాయంతో మనకి ఉన్న అడ్డంకులు తీస్తాం. ఇది ఎంతో సమయాభావం తో కూడినది. అయితే

 Image result for bye bye camera app

ఫోటోషాప్ లోకి వెళ్లి అంతగా కష్టపడే పనిలేకుండా ఇప్పుడు ఒక యాప్ అందుబాటులోకి వచ్చేసింది. మీకు ఫోటోలో ఇష్టం లేని వాటిని ఈ యాప్ సాయంతో సులభంగా తొలగించవచ్చు. అది ఎలాగా, ఏమిటా యాప్ అంటే...bye bye camera ఈ యాప్ ద్వారా మీకు కోరుకున్న విధంగా ఫోటోలని చాలా సులభంగా  మార్పు  చేసుకోవచ్చు. ఈ యాప్ ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ ఆధారంగా పని చేస్తుంది.

 Image result for bye bye camera app

న్యాచురల్ నెట్వర్క్ ఆధారంగా, ఫోటోలో మనకి ఉన్న అభ్యతరాలని సులువుగా తొలగిచి ఆ తొలగించిన ప్రదేశంలో ఉన్న ప్రాంతానికి మ్యాచ్ అయ్యేలా ఫోటోలోని పిక్స్ ని చేర్చుతుంది.  అయితే ఇలాంటి యాప్స్ ఇప్పటికే అనేకం వచ్చినా సరే ఇది వాటికంటే మెరుగుగా పనిచేస్తుందంట. ప్రస్తుతానికి ఐ ఫోన్ లో మాత్రమే ఇది అందుబాటులో ఉందని, త్వరలో ఆండ్రాయిడ్‌ ఫోన్లలో కూడా అందుబాటులోకి వస్తుందని సదరు సంస్థ తెలిపింది.


మరింత సమాచారం తెలుసుకోండి: