ప్ర‌ముఖ టెక్‌ దిగ్గజం యాపిల్‌ వచ్చే నెల 10న సిలికాన్‌ వేలీలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వెల్లడించింది. ఈ కార్య‌క్ర‌మానికి ఇన్విటేషన్ల‌తో పాటు ప్రపంచం నలుమూలల నుండి ప్రెస్‌ను కూడా ఆహ్వానించింది. ఈ క్ర‌మంలోనే త‌దుప‌రి ఐఫోన్‌ను  వెర్షన్‌ను విడుద‌ల చేయ‌నుంది. ఆపిల్ నుండి వచ్చే తదుపరి పరికరాల్లో కొన్ని మార్పులను చూడబోతున్నార‌ని తెలుస్తోంది. సెప్టెంబరు 10న జరిగే ఆ కార్యక్రమంలో సరికొత్త ఐ ఫోన్లను ఆవిష్కరించేందుకు కంపెనీ సిద్ధమవుతోంది. 


ఈ సందర్భంగా కొత్త మోడల్ ఐ ఫోన్లు రాబోతున్నాయి. ఏటా సెప్టెంబరు 10న కాలిఫోర్నియాలోని కూపర్టినోలో గల యాపిల్‌ ప్రధాన కార్యాలయంలో కార్యక్రమం జరుగుతుంది. ప్రతి సంవత్సరం అదే రోజున కొత్త మోడళ్లను విడుదల చేస్తూ రావడం యాపిల్‌ ఆనవాయితీగా మారింది.అయితే ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా కొత్త ఐ ఫోన్‌ను ఆవిష్కరించేందుకు యాపిల్‌ సన్నాహాలు చేస్తోంది. 


ఈ క్ర‌మంలోనే సెప్టెండ‌ర్ 10న‌ ’ఐఫోన్‌ 11’ హ్యాండ్‌సెట్స్‌ను ఆవిష్కరించవచ్చని తెలుస్తోంది. ఐఫోన్‌ ఎక్స్‌ఎస్‌ సిరీస్‌ స్థానంలో వచ్చే కొత్త ఐఫోన్‌ 11 మోడల్‌లో ట్రిపుల్‌ రియర్‌ కెమెరా ఉండవచ్చన్న అంచనాలు ఉన్నాయి. ఐఫోన్‌ 10ఎస్‌, ఐఫోన్‌ 10ఎస్‌ మాక్స్‌, ఐఫోన్‌ ఎక్స్‌ఆర్‌లకు కొనసాగింపుగా ఐఫోన్‌ 11 సిరీస్‌లో మూడు ఫోన్లను విడుదల చేసే అవకాశముంది. అలాగే ఐఫోన్ 11, ఐఫోన్ 11 ప్రో మరియు ఐఫోన్ 11 ఆర్‌తో మూడు కొత్త ఐఫోన్‌ ఉత్పత్తులను ప్ర‌వేశ‌పెట్ట‌నుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: