చంద్రునిపై అడుగు పెట్టే దిశగా చంద్రయాన్ 2 విజయవంతంగా సాగుతోంది. ఇప్పటికే చంద్రునికి సమీపంలోకి వెళ్లి ఆ కక్ష్యలో చక్కర్లు కొడుతున్న.. ల్యాండర్‌ ‘విక్రమ్‌’ ఇప్పుడు ఇంకాస్త దగ్గరకు చేరింది. చంద్రయాన్‌-2లోని ల్యాండర్‌ ‘విక్రమ్‌’ కక్ష్య తగ్గింపును రెండోసారి ఇస్రో సైంటిస్టులు విజయవంతంగా చేపట్టారు.


ల్యాండర్‌ లోని చోదక శక్తిని 9 సెకన్ల పాటు మండించి... కక్ష్య ను తగ్గించారు ఇస్రో సైంటిస్టులు.. బుధవారం తెల్లవారుజామున 3:42గంటలకు ఈ ప్రాసెస్ పూర్తయింది. అంతకు ముందు వరకూ ఈ విక్రమ్ ల్యాండర్‌ 35 కిలోమీటర్లు x 101 కిలోమీటర్ల కక్ష్యలో తిరుగుతూ ఉండేది.. ప్రస్తుతం కక్ష్యను తగ్గించిన తర్వాత ఆర్బిటర్‌ 96 కి.మీx 125కి.మీ కక్ష్యలో తిరుగుతోంది.


ఈ కక్ష్య తగ్గింపుతో విక్రమ్ ల్యాండర్ చంద్రునికి మరింత దగ్గరైంది. మరో రెండు రోజుల తర్వాత ఈ ల్యాండర్ విక్రమ్ ఈనెల 7 చంద్రునిపై అడుగుపెట్టబోతోంది. చంద్రయాన్ 2 ప్రయోగం ప్రారంభం నుంచి ఇప్పటి వరకూ అంతా అనుకున్నట్టుగానే సాగుతోంది. మరో రెండు రోజులు సవ్యంగా సాగితే.. భారత్ తన అంతరిక్ష రంగంలో మరో మైలు రాయిని అందుకున్నట్టే.


ఈనెల 6న అర్ధరాత్రి దాటాక 1.30-2.30 గంటల మధ్య.. ల్యాండర్‌ చంద్రుడి దక్షిణ ధ్రువానికి చేరువలోని ప్రాంతంలో అడుగు పెడుతుంది. అడుగు పెట్టిన నాలుగు గంటల తర్వాత ల్యాండర్ నుంచి ఆరు చక్రాల రోబోటిక్ వాహనం ప్రగ్యాన్ రోవర్ బయటకు వస్తుంది.ఇది నెలవంకపై ఉండే నీరు, ఇతర లవణాల జాడపై పరిశోధనలు చేస్తుంది. జాబిల్లి దక్షిణ ధ్రువంపై రహస్యాలను వెలికి తీయనుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: