వివో జెడ్ 1ఎక్స్ సెప్టెంబర్ 6 న భారతదేశంలో లాంచ్ కానుంది. చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ వివో త‌న సరికొత్త స్మార్ట్ ఫోన్‌ను వివో జెడ్ 1 ఎక్స్ పేరు విడుద‌ల చేసేందుకు స‌న్నాహాలు చేస్తుంది. అయితే ఈ ఫోన్ ధర మాత్రం ఎంత ఉంటుందనేది అధికారికంగా ప్రకటించలేదు. వివో జెడ్ 1 ఎక్స్ స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్స్ ఇలా ఉన్నాయి. ఈ ఫోన్‌లో 4,500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది.


వెనుకవైపు ఉన్న మూడు కెమెరాల్లో ప్రధానంగా 48 మెగా పిక్సెల్ కెమెరా, 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా మరియు 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉంటాయి. 32 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరాతో రాబోతున్న‌ట్టు తెలుస్తోంది. అలాగే 22.5 వోల్టేజీ ఫ్లాష్ చార్జ్ టెక్నాలజీతోపాటు 5 నిమిషాలు ఛార్జింగ్ చేస్తే చాలు ఏకంగా మూడు గంటలపాటు పని చేస్తోంది.


ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ మరియు యూట్యూబ్ వినియోగానికి ఫోన్ 32.6 గంటల టాక్‌టైమ్ మరియు కొన్ని నిర్దిష్ట గంటలను అందిస్తుందని వివో పేర్కొంది. సెప్టెంబ‌ర్ 6న విడుద‌ల కాబోయే ఈ స్మార్ట్ ఫోన్‌.. వివో జెడ్ 1 ప్రో తర్వాత కంపెనీ జెడ్ సిరీస్‌లో భాగంగా విడుదలయ్యే రెండో స్మార్ట్‌ఫోన్ వివో జెడ్ 1 ఎక్స్ అవుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: